KS Chitra: కూతురును గుర్తు తెచ్చుకున్న సింగర్‌ కేఎస్‌ చిత్ర.. నిన్ను చాలా మిస్‌ అవుతున్నానంటూ ఎమోషనల్

Basha Shek

Basha Shek |

Updated on: Dec 18, 2022 | 9:55 PM

నాలుగు దశాబ్దాల సంగీత ప్రయాణంలో 25 వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆమె సొంతం. భారతీయ భాషలతో పాటు మలాయ్‌, లాటిన్‌, అరబిక్‌, ఇంగ్లిష్‌ ,ఫ్రెంచ్‌ తదితర విదేశీ భాషల్లోనూ తన గాన ప్రతిభను నిరూపించుకున్నారామె. ఇళయరాజా, ఏ.ఆర్‌.రెహమాన్‌, ఎస్పీబాలసుబ్రమణ్యం, యేసుదాస్‌, హంసలేఖ వంటి సంగీత దిగ్గజాలతో చిత్ర కలిసి పనిచేశారు.

KS Chitra: కూతురును గుర్తు తెచ్చుకున్న సింగర్‌ కేఎస్‌ చిత్ర.. నిన్ను చాలా మిస్‌ అవుతున్నానంటూ ఎమోషనల్
Singer Chitra

Follow us on

సింగర్‌ చిత్ర.. తేనె కన్నా తీయనైన గొంతుతో వేలాది పాటలకు ప్రాణం పోసిన ఈ లెజెండరీ సింగర్‌ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నాలుగు దశాబ్దాల సంగీత ప్రయాణంలో 25 వేలకు పైగా పాటలు పాడిన ఘనత ఆమె సొంతం. భారతీయ భాషలతో పాటు మలాయ్‌, లాటిన్‌, అరబిక్‌, ఇంగ్లిష్‌ ,ఫ్రెంచ్‌ తదితర విదేశీ భాషల్లోనూ తన గాన ప్రతిభను నిరూపించుకున్నారామె. ఇళయరాజా, ఏ.ఆర్‌.రెహమాన్‌, ఎస్పీబాలసుబ్రమణ్యం, యేసుదాస్‌, హంసలేఖ వంటి సంగీత దిగ్గజాలతో చిత్ర కలిసి పనిచేశారు. ఇలా సంగీత ప్రపంచంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించి తనకంటూ ఓ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారీ లెజెండరీ సింగర్‌. అయితే ఈమె వ్యక్తిగత జీవితంలో ఓ అనుకోని విషాదం చోటు చేసుకుంది. అదే తన కూతురు మరణం. చిత్ర విజయశంకర్ అనే ఒక ఇంజనీర్ ని పెళ్లి చేసుకోగా వీరికి నందన అనే ఒక పాప పుట్టింది. అయితే పాప డౌన్‌ సిండ్రోమ్‌ వ్యాధితో బాధపడేది. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే మనిషిలో అసలు ఎదుగుదల ఉండదు. నందనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఒక కచేరి లో పాల్గొనడానికి వెళ్లింది చిత్ర. అదే సమయంలో దురదృష్టవశాత్తూ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి కన్నుమూసింది నందన. 2011లో ఈ దురదృష్టకర ఘటన జరిగింది.

కాగా ఈ లోకం నుంచి వెళ్లిపోయిన తన కూతురు పేరుమీద ఓ ఛారిటబుల్‌ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిత్ర. కాగా ఇవాళ (డిసెంబర్‌ 18) నందన జయంతి. ఈ సందర్భంగా తన కూతురును గుర్తుకు తెచ్చకుని ఎమోషనలయ్యారామె. కూతురి ఫొటోను సోషల్ మీడియాలో షేర్‌ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఆమె ‘ ‘స్వర్గంలో దేవ కన్యలతో సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎన్నేళ్లు గడిచినా నీ వయసు పెరగదు. నాకు దూరంగా ఉన్నా క్షేమంగా ఉన్నావని నాకు తెలుసు. నిన్ను ఎంతో మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్‌ డే మై డియరెస్ట్‌ నందన’ అంటూ ఎమోషనల్ నోట్‌ను షేర్‌ చేశారు చిత్ర.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu