Mrs World 2022: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ మిసెస్‌ వరల్డ్‌ కిరీటం..

విశ్వవేదికపై భారత్‌కు మరోసారి అందాల కిరీటం దక్కింది. 63 దేశాల మహిళలు పాల్గొన్న మిసెస్‌ వరల్డ్‌ అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన 'సర్గమ్‌ కౌశల్‌' విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కిరీటం భారత్‌కు..

Mrs World 2022: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మళ్లీ మిసెస్‌ వరల్డ్‌ కిరీటం..
Mrs World 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 19, 2022 | 7:25 AM

విశ్వవేదికపై భారత్‌కు మరోసారి అందాల కిరీటం దక్కింది. 63 దేశాల మహిళలు పాల్గొన్న మిసెస్‌ వరల్డ్‌ అందాల పోటీల్లో జమ్మూకశ్మీర్‌కు చెందిన ‘సర్గమ్‌ కౌశల్‌’ విజేతగా నిలిచారు. దీంతో 21 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కిరీటం భారత్‌కు దక్కడం విశేషం. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగిన ‘అంతర్జాతీయ అందాల పోటీ మిసెస్ వరల్డ్ 2022’ పోటీల్లో విజేతగా నిలిచిన సర్గమ్‌కు 2021లో మిసెస్‌ వరల్డ్‌ అమెరికా విజేత షాయలిన్‌ ఫోర్డ్‌ ఈ కిరీటాన్ని అందజేసింది. మిసెస్‌ పాలినేషియా తొలి రన్నరప్‌గా.. మిసెస్‌ కెనడా రెండో రన్నరప్‌గా నిలిచారు. సర్గమ్‌ విజేతగా నిలిచినట్టు మిసెస్‌ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఆదివారం అధికారికంగా తన ఇన్‌స్టాఖాతాలో పోస్టు చేసింది.

దాదాపు 21-22 ఏళ్ల తర్వాత మనకు మళ్లీ కిరీటం వచ్చింది. ‘నాకు చాలా ఆనందంగా ఉంది. లవ్‌ యూ ఇండియా, లవ్‌ యూ వరల్డ్‌’’ అని మురిసిపోయారు సర్గమ్‌.

ఇవి కూడా చదవండి

వివాహిత మహిళల కోసం ఈ అందాల పోటీలు1984 నుంచి నిర్వహిస్తున్నారు. 2001లో భారత్‌కు చెందిన డాక్టర్‌ అదితీ గోవిత్రికర్‌ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక మిసెస్‌ వరల్డ్‌ కిరీటాన్ని దక్కించుకున్న మహిళగా సర్గమ్‌ రికార్డు సృష్టించారు. సర్గమ్‌ ఇంగ్లిష్‌ లిటరేచర్‌లో పీజీ పూర్తిచేసి విశాఖపట్నంలో కొంతకాలం టీచర్‌గానూ పనిచేశారు. క్యాన్సర్‌ బాధిత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. ఆమె భర్త ఆది కౌశల్‌ భారత నౌకాదళ అధికారి. ఈ కిరీటం సాధించిన సర్గమ్‌ కౌశల్‌ను అదితీ గోవిత్రికర్‌ అభినందించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.