Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mosquitoes Bite: దోమలతో జర భద్రం..! ప్రాణాంతక బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తున్నాయ్‌..

దోమలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన తాజా అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు..

Mosquitoes Bite: దోమలతో జర భద్రం..! ప్రాణాంతక బ్యాక్టీరియాను వ్యాపింపజేస్తున్నాయ్‌..
Mosquitoes
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 18, 2022 | 1:21 PM

దోమలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే.. నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన తాజా అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎంటమాలజీ ప్రొఫెసర్‌ ఆర్‌ మైఖెల్‌ రో ఏంటున్నారంటే.. దోమలు శరీరంపై వాలినప్పుడు రక్తాన్ని మాత్రమే పీల్చుకుని వెళ్లవు. దోమలు ఎక్కడైతే వాలుతాయో అక్కడ మలవిసర్జన చేయడం ద్వారా వ్యాధికారక బ్యాక్టీరియాను వ్యాపింపజేయగలవని అంటున్నారు.

సెంటర్ సూయిస్ డి రీచెర్చెస్ సైంటిఫిక్స్‌లోని పరిశోధకులు కోట్ డి ఐవోయిర్‌లోని వరి ఉత్పత్తి చేసే ప్రాంతాలలోని ఇళ్ల నుంచి 79 ఆడ అనాఫిలిస్ దోమలను పరిశోధకులు సేకరించారు. ఈ దోమల శరీరం లోపల, బాహ్య ఉపరితలాలపై సూక్ష్మజీవులను వీరు కనుగొన్నారు. దోమల బాహ్య శరీరంపైకన్నా లోపల అత్యధిక బ్యాక్టీరియా ఉన్నట్లు వీరి పరిశోధనల్లో కనుగొన్నారు. ఇవి శరీరంపై కుట్టినప్పుడు ప్రమాదకర బ్యాక్టీరియాను వ్యాపించజేస్తాయని తెలిపారు. ఐతే ఇండోర్‌, ఔట్‌డోర్‌ దోమల నుంచి సేకరించిన నమూనాల్లో స్పష్టమైన తేడాను గుర్తించామన్నారు. మొక్కల ఆధారిత తేనెను ఆహారంగా తీసుకునే దోమల్లో ఫ్రక్టోబాసిల్లస్‌ (fructobacillus) ల్యాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇది సాధారణంగా పువ్వులు, మొక్కలపై అత్యధికంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

స్టెఫిలోకాకస్, రికెట్సియా అనే రెండు రకాల ప్రమాదకర బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఈ బ్యాక్టీరియా మానవ, జంతువుల వ్యాధులతో సంబంధం కలిగి ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి దోమలు బ్యాక్టీరియాను బాహ్యంగా, అంతర్గతంగా వ్యాపింపజేస్తాయని, దోమకాటుకు దూరంగా ఉండటం ద్వారా వ్యాధుల భారీన పడకుండా ఉండవచ్చని సూచిస్తున్నారు.