AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాయకత్వ లక్షణాలు అనేవి మంత్రతంత్రాల వల్ల అబ్బవు: ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిన్న సాయంత్రం..

నాయకత్వ లక్షణాలు అనేవి మంత్రతంత్రాల వల్ల అబ్బవు: ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి
Infosys Founder Narayanamurthy
Srilakshmi C
|

Updated on: Dec 18, 2022 | 9:52 AM

Share

ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది. బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో నిన్న సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు ఆర్‌ఎన్‌ నారాయణమూర్తి హాజరయ్యారు . అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి దిశా నిర్దేశం చేశారు.. నాయకత్వం అనేది ప్రజల ఆకాంక్షల నుంచి వస్తుందని, దీనికి ప్రత్యేకంగా మంత్రాలు అంటూ ఉండవన్నారు ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి. విశాఖ ఏయూలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఆయన

పూర్వ విద్యార్థుల సంఘం వార్షికోత్సవ ప్రత్యేక సంచికను ముఖ్య అతిథి చేతులు మీదుగా విడుదల చేశారు. అలాగే, విశ్వవిద్యాలయం శతాబ్ది మహోత్సవం ప్రత్యేక లోగోను ఆవిష్కరించారు. అతిథులు ప్రసంగాల అనంతరం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో నూతనంగా ఏర్పాటైన హబ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ను సందర్శించి అంకురాల్ని ప్రోత్సహిస్తున్న విధానం, భవిష్యత్‌ కార్యాచరణను సెంటర్‌ సీఈవో రవి ఈశ్వరపు ఆయనకు వివరించారు.

అనంతరం ఏయూ నాస్‌కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను సందర్శించి పరిశోధనలు, స్టార్టప్‌ సంస్థల్ని ప్రోత్సహిస్తూ, మార్గదర్శకం అందిస్తున్న విధానాల్ని నారాయణమూర్తి పరిశీలించారు. ఏయులో ఏర్పాటు చేసిన డ్రీమ్‌వాల్‌ని పరిశీలించారు. విద్యార్థులు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, సీఈవోలుగా ఎదగాలనే స్ఫూర్తిని నింపేలా ఈ డ్రీమ్‌ వాల్‌ ఏర్పాటైందన్నారు నారాయణమూర్తి. కాగా అంతర్జాతీయ స్థాయిలో ఇన్ఫోసిస్‌ సంస్థను తీర్చిదిద్దిన నారాయణ మూర్తి తమ విశ్వవిద్యాలయానికి రావడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.