Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తెలంగాణ స్కూల్స్‌, కాలేజీల్లో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు చెక్‌.. త్వరలో యాంటీ డ్రగ్స్‌ కమిటీలు..

డ్రగ్స్ స్మగ్లింగ్, దందా, వినియోగాలకు చెక్ పెట్టేందుకు విద్యా సంస్థల్లో డ్రగ్స్ కమిటీలు వేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా దారుణంగా.

Hyderabad: తెలంగాణ స్కూల్స్‌, కాలేజీల్లో ఆడపిల్లలపై అఘాయిత్యాలకు చెక్‌.. త్వరలో యాంటీ డ్రగ్స్‌ కమిటీలు..
Hyderabad CP CV Anand
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 18, 2022 | 7:37 AM

డ్రగ్స్ స్మగ్లింగ్, దందా, వినియోగాలకు చెక్ పెట్టేందుకు విద్యా సంస్థల్లో డ్రగ్స్ కమిటీలు వేస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అమ్మాయిలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చాలా దారుణంగా ఉంటున్నాయని.. వాటిని కట్టడి చేయడం కోసం త్వరలో కొత్త చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందన్నారు.

ఓయూ ఠాగూర్‌ స్టేడియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. స్కూళ్లు, కాలేజీల్లో అమ్మాయిలపై అఘాయిత్యాల నివారణకు ప్రత్యేక చట్టం తీసుసుకు రానున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ప్రత్యేక చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తుందన్నారు. డీవీఏ స్కూల్‌లో జరిగిన ఘటన తర్వాత చట్టంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే స్కూల్స్‌, కాలేజీల్లో చిన్నారులు, యువతులపై అఘాయిత్యాలున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సీపీ. యాంటీ డ్రగ్స్‌ కమిటీల్లానే ఈ చట్టం పని చేస్తుందన్నారు సీపీ ఆనంద్. దేశంలో మాదక ద్రవ్యాల వినియోగిస్తున్న వారిసంఖ్య 11 కోట్లుగా ఉందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మాదక ద్రవ్యాల వినియోగం బాగా పెరుగుతుందన్నారు. విద్యార్థులు కూడా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ..దశాబ్ద క్రితం ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా కాలేజీల్లో కమిటీలు వేశామని, కమిటీలతో ఎన్నో మంచి ఫలితాలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం మాదక ద్రవ్యాలను నిరోధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

మాదక ద్రవ్యాల వ్యతిరేక కమిటీల్లో విద్యార్థులను చేర్చాలన్నారు. గోవా డ్రగ్స్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందని, గోవాలో ఉండి హైదరాబాద్‌లో డ్రగ్స్‌ అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇకపై విద్యాసంస్థల్లో డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని.. అలాగే అమ్మాయిల మీద అఘాయిత్యాలపై సర్కార్ ప్రత్యేక చట్టం తీసుకు రాబోతుందని సీపీ ఆనంద్ వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.