Warm Jaggery Water: వేడి నీళ్లలో అంగుళం బెల్లం ముక్కవేసి ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాగారంటే..

బెల్లంను 'పొటాషియం స్టోర్‌హౌస్‌' అని పిలుస్తారు. దీనితోపాటు కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రముఖ పోషకాహార నిపుణులు సోనియా బక్షి ఏం చెబుతున్నారంటే..

Warm Jaggery Water: వేడి నీళ్లలో అంగుళం బెల్లం ముక్కవేసి ప్రతి రోజూ ఖాళీ కడుపుతో తాగారంటే..
Warm Jaggery Water
Follow us

|

Updated on: Dec 18, 2022 | 9:34 AM

చక్కెరకు ప్రత్యామ్నయంగా బెల్లంను అనేక మంది తమ రోజువారీ ఆహారాల్లో ఉపయోగిస్తుంటారు. టీ, కాఫీలు, స్వీట్స్‌ వంటి ఇతర ఆహారాలలో బెల్లంను జోడించి నోటికి రుచిగా ఉండేలా తమదైన పద్ధతుల్లో వండివాడ్చేస్తుంటారు. నిజానికి బెల్లంను ‘పొటాషియం స్టోర్‌హౌస్‌’ అని పిలుస్తారు. దీనితోపాటు కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ వంటి విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రముఖ పోషకాహార నిపుణులు సోనియా బక్షి ఏం చెబుతున్నారంటే.. శీతాకాలంలో ఉదయం పూట పరగడుపున వేడినీళ్లలో బెల్లం కలిపి గోరువెచ్చగా తాగితే, శరీరానికి సహజమైన డిటాక్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా దీనిలోని ఔషధ గుణాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఉదయాన్నే ఈ పానియాన్ని గ్లాసుడు తాగారంటే బరువు అమాంతం తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బెల్లంతో తయారు చేసిన ఈ పానియాన్ని సేవించవచ్చు.

దీనిని ఎలా తయారు చేయాలంటే..

స్టవ్‌పై ఒక గిన్నెలో గ్లాస్‌ నీళ్లు వేడి చేయాలి. అంగుళం బెల్లం ముక్కను వేసి కరిగేంత వరకు స్పూన్‌తో కలుపుకోవాలి. ఆ తర్వాత కాస్త చల్లారనిచ్చి.. వడకట్టి గోరువెచ్చగా తాగాలి.

Warm Jaggery Water

Warm Jaggery Water

ఎముకలు దృఢంగా..

బెల్లం వేసిన వేడి నీళ్లను తాగడం వల్ల ఎముకలు బలపడి, కీళ్ల నొప్పులను నయం చేస్తుంది. దీనిలోని పొటాషియం, సోడియం రక్తపోటును సమతుల్యం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఐరన్‌ లోపాన్ని మెరుగుపరుస్తుంది

రక్త హీణతతో బాధపడేవారికి ఈ పానియం అద్భుత ప్రయోజనాన్ని ఇస్తుంది. హిమోగ్లోబిన్, ఐరెన్, ఫోలేట్‌ సమృద్ధిగా అందిస్తుంది. రక్తంలో RBC కౌంట్‌ను వృద్ధి చేస్తుంది.

చర్మం మెరుస్తుంది

బెల్లానికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. తద్వారా కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా గోరు వెచ్చని నీటిలో బెల్లం వేసుకుని తాగితే మీ చర్మం మెరుపులీనుతుంది. శరీరం నుంచి హానికరమైన టాక్సిన్లను బయటకు పంపుతుంది.

బరువు అదుపులోనే..

వారానికి రెండు లేదా మూడు సార్లు వేడి నీళ్లలో బెల్లం కులుపుకుని తాగితే బరువు క్రమంగా తగ్గుముఖం పడుతుంది. బెల్లంలోని పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. బెల్లంలో ఉండే మెగ్నీషియం, విటమిన్ B1, B6, సీ విటమిన్లు రోగనిరోధకతను పెంపొందిస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే ఈ పానియాన్ని తాగితే రోగనిరోధక శక్తి పెరుగడంలో తోడ్పడుతుందని పోషకాహార నిపుణులు సోనియా బక్షి సూచిస్తున్నారు.

మరిన్ని తాజా ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.