AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Foods For Liver: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఐదు ఆహారాలు తప్పక తీసుకోవాలి.. అవేంటంటే?

కాలేయం ముఖ్యంగా రక్తం నుంచి టాక్సిన్లను తొలగించడం నుంచి జీర్ణక్రియను ప్రోత్సహించడం, శరీరం తర్వాత ఉపయోగించుకోడానికి విటమిన్ల నిల్వ చేయడం వంటి ఎన్నో పనులను చేస్తుంది. కాలేయం మనం తినే ప్రతి దాన్ని శుభ్రపరుస్తుంది.

Super Foods For Liver: లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఐదు ఆహారాలు తప్పక తీసుకోవాలి.. అవేంటంటే?
Liver
TV9 Telugu Digital Desk
| Edited By: Venkata Chari|

Updated on: Dec 18, 2022 | 2:38 PM

Share

కాలేయం అనేది మానవ శరీరంలో ఓ ప్రధానమైన అవయవం. మనం ఆహారం తీసుకున్నప్పడు అది కాలేయం ద్వారా తయారయ్యే వివిధ ఎంజైమ్ లు, ప్రోటీన్లు, పిత్త ద్వారా కడుపు, పేగుల్లోకి వచ్చి విచ్ఛిన్నమవుతుంది. ఇది ఖనిజాలు, కార్పొహైడ్రేట్లు, విటమిన్లకు రిపోజిటరీగా పని చేస్తుంది. కాలేయం రక్తం నుంచి టాక్సిన్లను తొలగించడం నుంచి జీర్ణక్రియను ప్రోత్సహించడం, శరీరం తర్వాత ఉపయోగించుకోడానికి విటమిన్ల నిల్వ చేయడం వంటి ఎన్నో పనులను చేస్తుంది. కాలేయం మనం తినే ప్రతి దాన్ని శుభ్రపరుస్తుంది. కాబట్టి కాలేయాన్ని రక్షించుకోవడం చాలా అవసరం. కాలేయ రక్షణకు దానికి అనుకూలమైన ఆహారం తీసుకోవడం మేలు చేస్తుంది. కాలేయాన్ని శుభ్రపరిచే అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకుందామా..?

వీట్ గ్రాస్ (గోధుమ గడ్డి) :

గోధుమ గడ్డిని జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా కాలేయానికి చాలా మంచిది. ఇందులో ఉండే క్లోరోఫిల్ ద్వారా విష పదార్థాలను తొలగించవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్ ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు దోహదం చేస్తుంది.

బీట్ రూట్ :

బీట్ రూట్ లో నైట్రేట్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని బీటాలైన్స్ గా పిలుస్తారు. వీటి ద్వారా ఆక్సీకరణ నష్టాలను, లివర్ వాపును తగ్గించుకోవచ్చు.  అలాగే సహజ డీటాఫ్సికేషన్ ఎంజైమ్స్ ను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. 

ఇవి కూడా చదవండి

 ద్రాక్ష:

కాలేయ రక్షణుకు ద్రాక్షను తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్ల స్థాయి పెరుగుతుంది. అలాగే లివర్ వాపును తగ్గించడంలో సాయం చేస్తుంది. 

 మొలకల కూరగాయలు:

బ్రొకోలి, కాలీఫ్లవర్ వంటి కూరగాయలను తినడం వల్ల కాలేయానికి సంబంధించిన సహజ నిర్విషీకరణ ఎంజైమ్ లను పెంచడంలో సాయం చేస్తాయి. అలాగే కాలేయ ఎంజైమ్ ల రక్త స్థాయిలను మెరుగుపరుస్తాయి. 

వాల్ నట్స్:

ఫ్యాటీ లివర్ ను తగ్గించడంలో వాల్ నట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. వాల్ నట్స్ లో ఓమెగా-3, 6 వంటి ఫ్యాటీ యాసిడ్ లు, అలాగే పాలీ ఫెనాల్ వంటి యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి వాల్ నట్స్ తింటే కాలేయాన్ని పరిరక్షించుకోవచ్చు. 

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..