Egg Yolk: గుడ్డులోని పచ్చసొనను తినవచ్చా.. తినకూడదా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నిత్యం సరిపడని మోతాదులో పోషక విలువలున్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రెడ్స్ పుష్కలంగా ఉండాలి. అందుకే నిత్యం..

Egg Yolk: గుడ్డులోని పచ్చసొనను తినవచ్చా.. తినకూడదా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే..
మన గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ స్థాయి ఎల్లప్పుడూ నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో ఎక్కువ గుడ్లు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీని కారణంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
Follow us

|

Updated on: Dec 18, 2022 | 1:59 PM

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం నిత్యం సరిపడని మోతాదులో పోషక విలువలున్న ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రెడ్స్ పుష్కలంగా ఉండాలి. ఇంకా మనం పాటించే  ఆహారపు అలవాట్లే మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. అందుకే నిత్యం గుడ్లను తినాలని చాలా మంది వైద్యలు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఢిల్లీకి చెందిన ప్రముఖ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ (ఎండి, డిఎమ్ న్యూరాలజీ ఎయిమ్స్) గుడ్లపై ఉన్న అపోహాల గురించి చర్చించారు. ఈ క్రమంలోనే ఆమె గుడ్డు లోపల ఉండే తెల్లసొన గురించి చర్చించారు. దానిని వద్దనుకోవడానికి గల కారణాల గురించి ఆమె మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Dr.Priyanka Sehrawat (@docpriyankasehrawat)

  1. గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్, విటమిన్ బి2 చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే గుడ్డు పచ్చసొనలో కూడా వివిధ విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఉన్నాయి. ఇవి మన శరీరానికి కూడా చాలా ముఖ్యమైనవని డాక్టర్ నెహ్రావత్ అంటున్నారు.
  2. గుడ్డు సొనల గురించి మాట్లాడుతూ వాటిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ కె, ఒమేగా 3 వంటివి ఉన్నాయి. ఇంకా శరీర రోగనిరోధక శక్తిని పెంచే హెల్దీ ఫ్యాటీ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుందని ఆమె తెలిపారు.
  3. మొత్తం గుడ్డు తినడం వల్ల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ కూడా సమంగా లభిస్తాయని ఆమె చెబుతోంది. గుడ్డు పచ్చసొనలో సెలీనియం అనే పోషక పదార్థం పుష్కలంగా ఉంటుందని.. ఇది జుట్టు, గోళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతోంది. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది.
  4. సెలీనియం లోపం వల్ల కేషన్ సమస్యతో పాటు కార్డియోమయోపతి, గుండె కండరాల వ్యాధి, కాషిన్ బెక్ వ్యాధి, ఓ రకమైన ఆస్టియో ఆర్థరైటిస్ వంటివి అనేక పమస్యలు తలెత్తుతాయి.
  5. గుడ్డుసొనలో విటమిన్ ఎ, డి, ఇ, ఫోలేట్, విటమిన్ బి12, అమైనో యాసిడ్స్ ట్రిప్టోఫాన్, టైరోసిన్ వంటి ముఖ్య పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
  6. గుడ్డు పచ్చసొనలో పొటాషియం, సోడియం, జింక్, మెగ్నీషియం, పాస్ఫరస్, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటాయి.
  7. ఓ పెద్ద గుడ్డులో 55 కేలరీలు, 2.5 గ్రాముల ప్రోటీన్, 4.5 గ్రాముల కొవ్వు, 0.61 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

మరిన్ని తాజా ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.

Latest Articles