AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Minister Roja: ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా.. టీడీపీ మాట మార్చిందన్న వైసీపీ నాయకురాలు….

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు రోజా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ  175 స్థానాలు గెలుస్తుందన్నారు. ఆదివారం లంబసింగి పర్యటనకు వెళ్తూ.. అనకాపల్లి జిల్లాలోని రాయల్ పార్క్ రిసార్ట్స్‌లో జరిగిన  మీడియా సమావేశంలో మంత్రి రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన..

AP Minister Roja: ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి రోజా.. టీడీపీ మాట మార్చిందన్న వైసీపీ నాయకురాలు....
Ap Monister Roja
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 18, 2022 | 1:04 PM

Share

ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు రోజా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ  175 స్థానాలు గెలుస్తుందన్నారు. ఆదివారం లంబసింగి పర్యటనకు వెళ్తూ.. అనకాపల్లి జిల్లాలోని రాయల్ పార్క్ రిసార్ట్స్‌లో జరిగిన  మీడియా సమావేశంలో మంత్రి రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంకా ప్రకృతి అందాలు దెబ్బతినకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని  రోజా స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత పర్యాటక రంగం మరింత పుంజుకుందని, టెంపుల్ టూరిజంలో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలు వైసీపీనే గెలుస్తుందన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తామని గతంలో టీడీపీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన రోజా.. ఆ తర్వాత టీడీపీ మాట మార్చిందన్నారు.

సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తామని ఇప్పుడు టీడీపీ నేతలు చెబుతున్నారని, రోజుకో మాట మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు. ‘‘జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడిందని, అభివృద్ధి చెందిందని ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకునేలా పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిస్ట్ ప్రాంతాల్లో మరిన్ని వసతులు కల్పించేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. స్వదేశీ దర్శన్, ప్రసాద పథకాలలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు నాలుగు ప్రాజెక్టులు మంజూరు అయ్యాయ’’ని రోజా తెలిపారు.

కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపు దిశగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సీఎం జగన్ ఇప్పటికే సూచనలు చేశారు. అందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసిన భరత్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన జగన్.. వచ్చే ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అలాగే గత ఎన్నికల్లో ఎమ్మెల్సీ లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గం, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి టెక్కలి నియోజకవర్గంతో పాటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..