AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taraneh Alidoosti Arrest: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక నిరసనల వేళ మరో నటి అరెస్ట్.. ఆమెను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే..

ఇరాన్ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో నేరాలకు పాల్పడిన వ్యక్తిని ఇటీవలే ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. అయితే ఆ వ్యక్తికి సంఘీభావం తెలియజేస్తూ ఆ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందని ఆ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘దీ సేల్స్‌మ్యాన్’ సినిమా స్టార్  తారనేహ్ అలిదూస్తీ ఉరితీయబడిన మొదటి వ్యక్తికి,,

Taraneh Alidoosti Arrest: ఇరాన్‌లో హిజాబ్‌ వ్యతిరేక నిరసనల వేళ మరో నటి అరెస్ట్.. ఆమెను ఎందుకు అదుపులోకి తీసుకున్నారంటే..
Taraneh Alidoosti
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 18, 2022 | 11:54 AM

Share

ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లోని మహిళలు, మానవతావాదులు నిరసనలు చేస్తున్నారు. అయితే ఈ నిరసన తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఇరాన్ అధికారులు ఆ దేశంలోని ఓ ప్రముఖ నటి ఒకరిని అరెస్టు చేసినట్లు ఇస్తామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ(IRNA) శనివారం తెలిపింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో నేరాలకు పాల్పడిన వ్యక్తిని ఇటీవలే ఇరాన్ ప్రభుత్వం ఉరితీసింది. అయితే ఆ వ్యక్తికి సంఘీభావం తెలియజేస్తూ ఆ నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందని ఆ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘దీ సేల్స్‌మ్యాన్’ సినిమా స్టార్  తారనేహ్ అలిదూస్తీ ఉరితీయబడిన మొదటి వ్యక్తికి సంఘీభావం తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినందుకు ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు IRNA నివేదిక తెలిపింది. ఈ మేరకు IRNA అధికారిక టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రచురించిన కథనం ప్రకారం అలిదూస్తి తన వాదనలకు అనుగుణంగా ఎటువంటి పత్రాలను అందించకపోవడంతో ఆమెను అరెస్టు చేశారు.

 అయితే అతిదూస్తీ తన పోస్ట్‌లో ‘‘ తన పేరు మొహసేన్ షెకారి. ఈ రక్తపాతాన్ని చూసి కూడా దీనిపై చర్యలు తీసుకోని ప్రతి అంతర్జాతీయ సంస్థలు మానవాళికి అవమానకరం’’ అని రాసుకోచ్చారు. టెహ్రాన్‌లోని ఒక వీధిలో దేశ భద్రతా దళాల సిబ్బందిపై షెకారీ దాడి చేసినందుకు ఇరాన్ కోర్టు ఇచ్చిన తీర్పు అనంతరం అతన్ని డిసెంబర్ 9న ఉరితీశారు. కాగా, హిజాబ్‌ను సరిగ్గా ధరించలేదనే కారణంతో ఇరాన్ మోరలింగ్ పోలీసుల నిర్బంధంలో ఉన్న 22 ఏళ్ల మహసా అమిని సెప్టెంబర్ 16న మరణించినప్పటి నుంచి ఇరాన్ నిరసనలతో అట్టుడికింది.

ఇవి కూడా చదవండి

ఈ నిరసనకారులకు సోషల్ మీడియాలో సంఘీభావం తెలిపినందుకు ఇరాన్‌లోని మరో ఇద్దరు ప్రముఖ నటీమణులు హెంగామెహ్ ఘజియానీ, కటయోన్ రియాహిను దేశ అధికారులు అరెస్టు చేశారు. తర్వాత వారిద్దరూ విడుదలయ్యారు. ఇరాన్‌లోని మానవ హక్కుల కార్యకర్తల ప్రకారం నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి కనీసం 495 మంది మరణించారు. ఇంకా 18,200 మందిని ఇరాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.