- Telugu News Photo Gallery World photos Vietnam's Famous Gilded House Becomes Tourists Centre Of Attraction photos goes viral in social media
Gold Gilded House: అందరికంటే భిన్నంగా ఉండాలన్న వ్యాపారి.. భవనం మొత్తం బంగారంతోనే నిర్మాణం.. పోటెత్తుతున్న పర్యాటకులు ఎక్కడంటే..
కలలు అందరూ కంటారు.. కానీ కొందరే నెరవేర్చుకోగలుగుతారు. ఇదిగో వియత్నాంకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తన ఇంటిని నిర్మించుకోవాలనుకున్నాడు. అందుకు ఏకంగా దేశవిదేశాలు తిరిగాడు. చివరకు తాను అనుకున్న విధంగా బంగారు భవనం నిర్మించుకున్నాడు.
Updated on: Dec 18, 2022 | 1:14 PM

కలలు అందరూ కంటారు.. కానీ కొందరే నెరవేర్చుకోగలుగుతారు. ఇదిగో వియత్నాంకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తన ఇంటిని నిర్మించుకోవాలనుకున్నాడు. అందుకు ఏకంగా దేశవిదేశాలు తిరిగాడు. రకరకాల నమూనాలను పరిశీలించాడు. చివరకు తాను అనుకున్న విధంగా బంగారు భవనం నిర్మించుకున్నాడు. ఇప్పడు ఆ బంగారు భవంతి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.

వియత్నాంలోని కాన్‌థోనగరానికి చెందిన ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బాగానే డబ్బు సంపాదించాడు. ఇక తాను నివసించే ఇల్లు ప్రపంచంలోనే ప్రత్యేకంగా ఉండాలనుకున్న అతను ఓ బంగారు భవంతిని నిర్మించుకున్నాడు.

ఈ భవంతి నిర్మాణానికి ఏకంగా మూడేళ్లు పట్టిందట. వియత్నాం దేశానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ భవంతిని చూసేందుకు పర్యాటకులు ఎగబడుతున్నారు.

కేజీఎఫ్‌ను తలదన్నే ఆ భవనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆ ఇల్లు మొత్తం లోపల, బయట, పై కప్పుతో సహా బంగారు తాపడంతో నిర్మించారు. గోడల నుండి ఫర్నీచర్, వివిధ అలంకరణలు, ప్రతిదీ బంగారంతో లేదా కనీసం బంగారు పూతతో నింపేశారు.

ఇంటినిండా కళ్లు చెదిరే బంగారు వస్తువులే. కొన్ని భారీ విగ్రహాలు తప్ప ఇంట్లోని ప్రతి వస్తువూ బంగారంతో తయారు చేసిన వాటితోనే నింపేశారు. పూతపూసిన వెలుపలి భాగం బాటసారులందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వీరిలో చాలామంది ఫోటోలు తీయడానికి.. బాల్కనీలో అలంకరించిన వివిధ బంగారు విగ్రహాలను చూడటానికి ఆగిపోతారు.

అయితే బంగారంపై యజమానికి ఉన్న మక్కువ భవనం లోపలి భాగంలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులు పనికట్టుకుని మరీ కాన్‌థో నగరానికి వచ్చి, ఈ ఇంటిని కళ్లారా చూసి వెళుతున్నారు. తన ఇంటి పట్ల ఇతరులకు ఉన్న ఆసక్తిని గమనించిన తర్వాత ఎంగ్యూయెన్ వాన్ ట్రుంగ్ సరైన పర్యాటక ఆకర్షణగా రూపొందించాడు. తన భవనాన్ని చూడాలనే ఆసక్తి గల పర్యాటకుల నుంచి 50,000 డాంగ్ ($4) వసూలు చేయడం ప్రారంభించాడు. ఇంటి పక్కన ఒక కేఫ్‌ను కూడా ప్రారంభించాడు.

"ఇంత బంగారం పొదిగిన ఇల్లు తాను ఎన్నడూ చూడలేదని .. ఇది నిజమైన బంగారమా లేదా నకిలీ బంగారమా అనేది తెలియదు.. అయితే ఈ అనుభూతి నిజంగా గొప్పది.. అని ఒక మహిళా పర్యాటకురాలు అన్నారు.





























