FIFA World Cup 2022: ఫుట్‌బాల్ టోర్నీ మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా.. ఆ జట్టుకు ప్రైజ్ మనీగా ఎంత అందిందంటే..

ఆదివారం( డిసెంబర్ 18) ఫ్రాన్స్, అర్జెంటీనా దేశాల మధ్య టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినవారు టోర్నీ విజేతగా, ఓడినవారు టోర్నీ రన్నరప్‌గా నిలవనున్నారు. అయితే మూడో స్థానంలో ఎవరు నిలిచారనేది నిర్ణయించేందుకు

FIFA World Cup 2022: ఫుట్‌బాల్ టోర్నీ మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా.. ఆ జట్టుకు ప్రైజ్ మనీగా ఎంత అందిందంటే..
Croatia Foodball Team
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 18, 2022 | 9:18 AM

ఖతర్ వేదికగా జరుగుతున్న ‘ఫీఫా వరల్డ్ కప్ 2022’ చివరి దశకు వచ్చేసింది. ఈ క్రమంలోనే ఆదివారం( డిసెంబర్ 18) ఫ్రాన్స్, అర్జెంటీనా దేశాల మధ్య టోర్నీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినవారు టోర్నీ విజేతగా, ఓడినవారు టోర్నీ రన్నరప్‌గా నిలవనున్నారు. అయితే మూడో స్థానంలో ఎవరు నిలిచారనేది నిర్ణయించేందుకు నిన్న(డిసెంబర్ 17) జరిగిన మ్యాచ్‌లో క్రోయేషియా, మొరాకో దేశాలు తలపడ్డాయి. ఈ మ్యాచ్ 7వ నిమిషంలో జోస్కో గార్డియెల్ చేసిన గోల్‌తో క్రొయేషియా ఆదిలోనే ఆధిక్యం సాధించింది. ఆ తర్వాి రెండో నిమిషంలోనే మొరాకో కూడా గోల్ చేసి ఆటను సమం చేసింది. అనంతరం ఇరు జట్లు గోల్‌ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా కొంత సమయం వరకు అది సాధ్యపడలేదు. ఇక 42వ నిమిషంలో మిస్లావ్ ఓర్సిక్ గోల్ చేయడంతో క్రొయేషియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఆధిక్యం తర్వాత మొరాకో గోల్ చేసి సమం చేసేందుకు ప్రయత్నించినా పరిస్థితులు ఆ దేశానికి అనుకూలించకపోవడంతో క్రొయేషియా 2-1తో విజయం సాధించింది.

టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన జట్టుకు ప్రైజ్ మనీ ఎంత అంటే..?

మొరాకోను 2-1తో ఓడించి 3వ స్థానంలో నిలిచిన క్రొయేషియా జట్టుకు 223 కోట్ల రూపాయల (27 మిలియన్ డాలర్లు) బహుమతి లభించింది. ఇక మ్యాచ్‌లో ఓడి 4వ స్థానంలో నిలిచిన మొరాకో జట్టు 206 కోట్ల రూపాయల (25 మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీ అందుకుంది.

ఇవి కూడా చదవండి

ఫైనల్ పోరు..

ఫీఫా ప్రపంచకప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా ఈ మ్యాచ్‌లో టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్‌తో అర్జెంటీనా తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు(డిసెంబర్ 18న) అర్జెంటీనా-ఫ్రాన్స్ జట్ల మధ్య జరిగే చివరి పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెస్సీ ప్రపంచకప్ కల నెరవేరుతుందా..? లేక డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా 2వ సారి విజయం సాధిస్తుందా..? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.347 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.248 కోట్లు ప్రైజ్ మనీగా అందుతాయి.

దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!

News9 Global Summit: భారత్ - జర్మనీ మైత్రి మరింత ముందుకు..

చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.

గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..

విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 2025లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు

ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్న సల్మాన్.. ఎందుకు కుదరలేదంటే..

మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు..!
పెట్రోల్‌ ట్యాంకర్‌లోంచి వింత శబ్ధాలు..! అడ్డుకున్న పోలీసులు షాక్

ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!

ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
ఇంత మంచోడివేంటయ్యా.. కంగువ సినిమాకు సూర్య రెమ్యునరేషన్ తెలిస్తే..
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!

మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!

పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు

ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!

అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం