Child Care Center: బేబీ సిట్టర్స్, నానీల కొరత.. ఉద్యోగాలు వదులుకుంటున్న అమెరికా మహిళ.. రీజన్ ఏమిటంటే..
అమెరికాలో 5 ఏళ్లలోపు పిల్లలకు 1.20 కోట్ల మంది నానీలు అవసరం కాగా, చైల్డ్ కేర్ సంస్థలు కేవలం 10 లక్షల మంది పిల్లలను మాత్రమే చూసుకోగలుగుతున్నాయి. నగర శివార్లలో, గ్రామాల్లో కొత్త శిశు సంరక్షణ కేంద్రాలు కూడా ప్రారంభించకపోవడం దీనికి ప్రధాన సమస్య.
అమెరికాలోని మహిళలు తమ ఉద్యోగాలను వదిలేయాల్సి వస్తోంది. దీనికి కారణం.. తమ పిల్లలను చూసుకునే నానీల కొరత, బేబీ సిట్టర్లు కొరత ఉండడంతో పాటు.. వీరికి చెల్లించాల్సిన జీతం తమ సంపాదన కంటే అధికంగా ఉండడంతో తమ ఉద్యోగాలను మహిళలు వదిలేస్తున్నారు. అవును అమెరికాలో బేబీ సిట్టర్లు కొరత ఉంది. ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, USలో 1 నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల 12 మిలియన్ల పిల్లలకు బేబీ సిట్టర్ అవసరం. అటువంటి పరిస్థితిలో.. పిల్లల సంరక్షణ కోసం రెండు ఎంపికలున్నాయి. ఒకటి నానీలను నియమించుకోవడం రెండు చైల్డ్ కేర్ సెంటర్. అయితే వీటి ఖర్చు ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి వారు భరించలేకపోతున్నారు.
అమెరికాలో ఉమ్మడి కుటుంబం అనే భావన లేదు. సాధారణంగా భార్యాభర్తలిద్దరూ అక్కడ పనిచేస్తారు. ఇద్దరూ తమ తమ పనులకు వెళ్తారు కాబట్టి పిల్లలను చూసుకోవడానికి బేబీ సిట్టర్ అవసరం. ప్రస్తుతం అమెరికాలో వీరి కొరత భారీగా ఉంది.. పిల్లల కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలు చాలా ఖరీదైనవిగా మారాయి. మధ్యతరగతి శ్రామిక మహిళలు తమ పిల్లల సంరక్షణ కోసం తమ ఉద్యోగాలను వదిలివేయవలసి వస్తుంది. నివేదిక ప్రకారం.. కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తర్వాత కూడా వేలాది మంది మహిళలు తమ పనికి తిరిగి వెళ్లడం లేదు. దీనికి కారణం మహిళలు ఉద్యోగాలు చేయడం ద్వారా సంపాదిస్తున్న మొత్తం జీతం లేదా అధిక భాగం పిల్లల సంరక్షణ కేంద్రంలోనే ఖర్చు చేయాల్సి వస్తోంది. నెల రోజులుగా పనిచేసినా మహిళలు డబ్బును పొదుపు చేసయలేకపోతున్నారు. దీంతో తమ ఉద్యోగాలను మహిళలు వదిలేస్తున్నారు.
చైల్డ్ కేర్ సెంటర్ ఫీజు అమెరికాలో శిక్షణ పొందిన బేబీ సిట్టర్ల కొరత ఏర్పడింది. సుమారు 80,000 మంది బేబీ సిట్టర్లు కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొరతను చాలా కంపెనీలు దీనిని సద్వినియోగం చేసుకున్నాయి. అమెరికాలోని పట్టణ ప్రాంతాల్లో శిశు సంరక్షణ కేంద్రాలను ప్రారంభించాయి. ముఖ్యంగా ఉన్నత తరగతి, ఆర్థికంగా సంపన్న కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో శిశుసంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాయి. అయితే వీటిల్లో పాఠశాలలు, కళాశాలల ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు శిశు సంరక్షణ కేంద్రాల్లో తమ పిల్లలను చేర్పించాలంటే అల్లాడిపోతున్నారు.
అమెరికాలో చైల్డ్ కేర్ సెంటర్స్ ఇప్పుడు మధ్యతరగతి వారు భరించలేని విధంగా విలాసవంతంగా మారుతున్నాయి. అయితే మధ్యతరగతి వారికి ఇవి చాలా అవసరం. కారణం భార్యాభర్తలిద్దరికీ ఇంటిని నడపడానికి ఉద్యోగం తప్పనిసరి. ఇప్పుడు ఇంట్లో బాలింత ఉంటే.. పిల్లల కోసం కేర్ సెంటర్ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. దీంతో మహిళలు సంపాదించినదంతా పిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన వారికి ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో.. మహిళలు పని చేయడం లేదా చేయకపోవడం సమానం అయింది. పిల్లల తల్లులు ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకోవాలని భావించడంతో ఇప్పుడు అమెరికాలో పెద్ద సంక్షోభం నెలకొంది.
అమెరికాలో 5 ఏళ్లలోపు పిల్లలకు 1.20 కోట్ల మంది నానీలు అవసరం కాగా, చైల్డ్ కేర్ సంస్థలు కేవలం 10 లక్షల మంది పిల్లలను మాత్రమే చూసుకోగలుగుతున్నాయి. నగర శివార్లలో, గ్రామాల్లో కొత్త శిశు సంరక్షణ కేంద్రాలు కూడా ప్రారంభించకపోవడం దీనికి ప్రధాన సమస్య. ముఖ్యంగా చైల్డ్ కేర్ సంస్థల లక్ష్యం ధనిక ఉన్నత తరగతి ప్రజలు.. వారి నుండి వారు భారీగా ఫీజులు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.
సాంప్రదాయ కమ్యూనిటీ చైల్డ్ కేర్ సెంటర్లు చాలా తక్కువ లాభాలను కలిగి పనిచేస్తున్నాయి. తద్వారా మధ్య , దిగువ తరగతులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. చైల్డ్ కేర్ కంపెనీలపై సర్వే నిర్వహిస్తున్న కన్సల్టెంట్ మాట్లాడుతూ.. చైల్డ్ కేర్ సెంటర్లను నిర్వహిస్తున్న కంపెనీలు ఈ ఏడాది కంటే వచ్చే ఏడాదికి 15-20 శాతం అధిక ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంటే ఇప్పుడు చైల్డ్ కేర్ సెంటర్ ఫీజులు ఎక్కువ కానున్నాయి.
ప్రభుత్వం ఏం చేస్తోంది? అమెరికాలో వర్కింగ్ కల్చర్ ఉన్న పరిస్థితిలో.. చైల్డ్ కేర్ సెక్టార్‌లో చాలా సంపాదన సామర్థ్యం ఉంది. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇతర రంగాలకు చెందిన కంపెనీలు కూడా ఇందులో తమ వంతు పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. సాంప్రదాయ కమ్యూనిటీ చైల్డ్ కేర్ సెంటర్లలో బేబీ సిట్టర్ల కొరత కూడా ఉండడంతో.. పెద్ద కంపెనీలు అధిక జీతాలతో ఎర చూపి తమ స్థానాలకు ఆహ్వానిస్తున్నాయి. ముఖ్యంగా కమ్యూనిటీ సెంటర్లలో ఆయాకు గంటకు సగటున రూ.1200 వచ్చేది. కాగా కంపెనీలు ఇంతకు మించి ఇస్తున్నాయి.
కరోనా తర్వాత పిల్లల సంరక్షణ ఖరీదైనదిగా మారిన పరిస్థితి గురించి పెద్దన్న జో బిడెన్ ప్రభుత్వానికి తెలుసు. అటువంటి పరిస్థితిలో, అధ్యక్షుడు జో బిడెన్ బిల్డ్ బ్యాక్ బెటర్ బిల్లును తీసుకువచ్చారు. ఈ బిల్లులో, కుటుంబ ఆదాయం ప్రకారం పిల్లల సంరక్షణ ఖర్చు నిర్ణయించబడింది. అయితే పిల్లల సంరక్షణ సంస్థలకు బలమైన లాబీ ఉంది. దీంతో ఈ బిల్లును చట్టంగా మారలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..