వీరు పుట్టగొడుగులు తినకూడదు.. తెలిసి తెలిసి ఈ తప్పు చేయకండి

25 December 2024

Ravi Kiran

పుట్టగొడుగుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ డి కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది

పుట్టగొడుగులు మన బీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఇమ్యూనిటీ పవర్‌ను మరింతగా పెంచుతాయని వైద్యులు అంటుంటారు. 

అయితే, కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని అస్సలు తినకూడదు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందామా

చర్మ అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు పుట్టగొడుగుల్ని అస్సలు తినకూడదు. వారు పుట్టగొడుగులు తింటే చర్మంపై దద్దుర్లు, చికాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

తలనొప్పి సమస్యతో బాధపడేవారు పుట్టగొడుగుల్ని తినకపోవడమే మంచిది. ఇలాంటి వారు తింటే తలనొప్పి, చిరాకు, తల మొత్తం భారంగా ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. 

జీర్ణ సమస్యలు ఉన్నవారు పుట్టగొడుగులను తినకపోవడం బెస్ట్.. వీళ్లు పొరపాటున తింటే.. విరేచనాలు, వికారం, వాంతులు వంటి కడుపు సమస్యలు వస్తాయి. 

మానసిక రుగ్మతులతో బాధపడేవారు పుట్టగొడుగులు అస్సలు తినకూడుదు. తిన్నట్లయితే వీరికి భయం, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు మరింతగా పెరుగుతాయి. 

గర్బిణీ స్త్రీలు లేదా పాలిచ్చే తల్లులు పుట్టగొడుగులను ఎవాయిడ్ చేయడం మంచిది. ఇవి బిడ్డ లేదా తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు చూపించే అవకాశం ఉంది. ఒకవేళ తినాలనుకుంటే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.