Trump Towers: భారత్‌లో విస్తరిస్తున్న ట్రంప్‌ రియల్టీ బిజినెస్‌.. రూ.5 వేల కోట్లతో పెట్టుబడి.. హైదరాబాద్‌పై ఫోకస్‌..?

సహారా ఎడారిలో కూడా ఇసుక అమ్మగల అత్యంత నేర్పరి ట్రంప్‌. ఓ మాదిరిగా నడుస్తున్న తన తాతల కాలం నాటి రియల్టీ బిజినెస్‌ను తాను చేపట్టి..రేసుగుర్రంలా దౌడ్‌ తీయించారు ట్రంప్‌..ట్రంప్‌ రియల్‌ బిజినెస్‌ స్టైల్‌ ఎలా ఉంటుందంటే.. ఆయన ఆల్రెడీ రియల్‌ బూమ్‌ ఉన్నచోట అడుగు పెట్టరు

Trump Towers: భారత్‌లో విస్తరిస్తున్న ట్రంప్‌ రియల్టీ బిజినెస్‌.. రూ.5 వేల కోట్లతో పెట్టుబడి.. హైదరాబాద్‌పై ఫోకస్‌..?
Trump Towers In Hyderabad
Follow us
Surya Kala

|

Updated on: Dec 15, 2022 | 8:27 AM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో తన రియల్టీ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా. ఇందులో భాగంగా ద ట్రంప్‌ ఆర్గనైజేషన్‌.. హైదరాబాద్‌లో రియల్టీ వెంచర్‌ వేయనుందా.. ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారా.. వచ్చే ఏడాది హైదరాబాద్‌లో ట్రంప్‌ కంపెనీ కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతోందా.. భాగ్యనగరంంలో లగ్జరీ రెసిడెన్షియల్‌ టవర్స్‌ రాబోతున్నాయా..అమెరికా టాప్‌ రియల్టర్‌గా ప్రసిద్ధి కెక్కిన ట్రంప్‌ హైదరాబాద్‌పై ఎందుకు ఫోకస్‌ పెట్టారు. ట్రంప్‌ను హైదరాబాద్‌లో అంతగా అట్రాక్ట్‌ చేసిందేంటి..ట్రంప్‌ కంపెనీ రాకతో.. హైదరాబాద్‌ రియల్టీ బిజినెస్‌ రాకెట్‌లా దూసుకెళ్తుందా…మార్కెట్‌ వర్గాలు ఏమంటున్నాయి.

ట్రంప్.. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌.. అంతకుముందు..ఆయనో పెద్ద రియల్టర్‌..ఇప్పటికీ ఆయన కంపెనీ అదే బిజినెస్‌ చేస్తోంది. రియల్టీ బిజినెస్‌లో ట్రంప్‌ది టాప్‌గేర్‌.. ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికానే ఏలిన ట్రంప్.. తాతలు కూడా రియల్టర్లే.. కాకపోతే ట్రంప్‌ సీన్‌లోకి ఎంటరయ్యాక.. రియల్‌ బిజినెస్‌ను చుక్కలను తాకించారు. స్కై లిమిట్‌గా దూసుకెళ్లారు. ట్రంప్‌కు అమెరికాతో పాటు..చాలా దేశాల్లో రియల్‌ బిజినెస్‌ ఉంది.. ఇప్పుడాయన కన్ను మన హైదరాబాద్‌పై పడింది. ఎందుకు..

భారత్‌లో విస్తరిస్తున్న ట్రంప్‌ రియల్టీ బిజినెస్‌

ఇవి కూడా చదవండి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో తన రియల్టీ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నిర్వహణలోని ద ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ వచ్చే ఏడాది రూ.5,000 కోట్ల పెట్టుబడితో ఏడెనిమిది సూపర్‌ లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఇందులో మూడు నుంచి ఐదు ప్రాజెక్టులు హైదరాబాద్‌, బెంగళూరు, లూథియానా, చండీగఢ్‌ నగరాల్లో రానున్నాయి. ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ట్రైబెకా డెవలపర్స్‌ అనే కంపెనీతో కలిసి ద ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ ఈ ప్రాజెక్టులు చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుల కోసమే.. కోసమే రూ.2,500 కోట్ల వరకు ఖర్చు చేస్తామని ట్రైబెకా డెవలపర్స్‌ ప్రమోటర్‌ కల్పేశ్‌ మెహతా ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ఈ సమావేశంలో ట్రంప్‌ కుమారుడు, ది ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ కూడా పాల్గొన్నారు. ట్రంప్‌ బ్రాండ్‌ పేరుతోనే ఈ హైఎండ్‌ లగ్జరీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు నిర్మిస్తామని ట్రంప్‌ జూనియర్‌ చెప్పారు.

అమెరికా తర్వాత ద ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు భారత్‌ రియల్టీదే అతిపెద్ద మార్కెట్‌. భారత మార్కెట్‌పై దృష్టి పెట్టేందుకు గాను పదేళ్లుగా డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ అమెరికాలో తనతో కలిసి చదువుకున్న కల్పేశ్‌ మెహతా ప్రమోట్‌ చేసిన ట్రైబెకా డెవలపర్స్‌తో కలిసి పని చేస్తున్నారు. ఈ జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఇప్పటికే పుణె, ముంబై, కోల్‌కతా, గురుగ్రామ్‌ ప్రాంతాల్లో 26 లక్షల చదరపు అడుగుల్లో లగ్జరీ విల్లాలు, ఆఫీసు భవనాలు నిర్మించింది. ఇప్పుడు కొత్తగా బెంగళూరు, హైదరాబాద్‌, లూథియానా, చండీగఢ్‌ నగరాలపై దృష్టి పెడుతోంది.

ఇప్పటికే ఖానామెట్‌లో హెచ్‌ఎండీఏ వేలం వేసిన 2.92 ఎకరాలను సొంతం చేసుకున్న ఓ నిర్మాణ సంస్థతో కలసి ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ 27 అంతస్తుల చొప్పున రెండు టవర్లను నిర్మించనుంది. మూడున్నరేళ్లలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 270 లగ్జరీ ఫ్లాట్లు నిర్మించనున్నారు. అన్నీ 4, 5 బెడ్‌రూమ్స్ ఇళ్లే.. ట్రంప్‌ టవర్‌ ప్రాజెక్టులో అన్నీ అంతర్జాతీయ స్థాయి వసతులు ఉండనున్నాయి. ప్రతి ఫ్లాట్‌కు ప్రైవేటు ఎలివేటర్, డబుల్‌ హైట్‌లో లివింగ్‌ స్పేస్, బాల్కనీలు ఉంటాయి. రెండు టవర్లను కలుపుతూ రూఫ్‌టాప్‌పై క్లబ్‌హౌస్‌ ఉంటుంది. ఈ ప్రాజెక్టులోని కామన్‌ ఏరియా ఇంటీరియర్‌ను ప్రముఖ బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుజానేఖాన్‌ డిజైన్‌ చేశారు.   హైదరాబాద్‌లో కాకలు తీరిన రియల్టర్లు

ట్రంప్‌ అంటే అమెరికా రియల్‌ బిజినెస్‌ కింగ్‌ అని చెప్పుకుంటారు. అలాంటి కింగ్‌..హైదరాబాద్‌పై ఫోకస్‌ పెట్టడమేంటని చాలామంది రియల్టర్లు చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకంటే..హైదరాబాద్‌లో ఇప్పటికే కాకలు తీరిన రియల్టర్లు ఉన్నారు. వీళ్ల వల్ల కానిదీ.. వీళ్లకు తెలియనిదీ..దశాబ్ధాలుగా రియల్టీ బిజినెస్‌లో పాతుకుపోయిన ఉద్ధండులకే పాఠాలు చెప్పగలిగినంత ట్రంప్‌ దగ్గర ఏముంది అన్నదే ఇప్పుడు ట్విన్‌ సిటీస్‌ రియల్టర్ల టాక్స్..అంటే దీనికీ ట్రంప్‌దగ్గర ఓ లెక్కుంది. అదేంటంటే..

ఎడారిలో కూడా ఇసుక అమ్మగల నేర్పరి ట్రంప్‌

సహారా ఎడారిలో కూడా ఇసుక అమ్మగల అత్యంత నేర్పరి ట్రంప్‌. ఓ మాదిరిగా నడుస్తున్న తన తాతల కాలం నాటి రియల్టీ బిజినెస్‌ను తాను చేపట్టి..రేసుగుర్రంలా దౌడ్‌ తీయించారు ట్రంప్‌..ట్రంప్‌ రియల్‌ బిజినెస్‌ స్టైల్‌ ఎలా ఉంటుందంటే.. ఆయన ఆల్రెడీ రియల్‌ బూమ్‌ ఉన్నచోట అడుగు పెట్టరు. తనే కొత్త చోట్ల రియల్‌ బూమ్‌ సృష్టించి..సెన్సేషన్‌ అవుతారు. అంటే ట్రెండ్‌ ఫాలో అవకుండా కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తారన్నమాట. తన స్థాపించినదే సామ్రాజ్యంఅన్నట్లు దాన్ని బాగా ప్రమోట్‌ చేసి.. మార్కెట్‌ను తన కాళ్ల దగ్గరికి తెచ్చుకోవడం ట్రంప్‌ రియల్టీ బిజినెస్‌ స్టైల్‌..ఆ విధానమే ఆయన్ను రియల్ రంగంలో హీరోని చేసింది..ఇండియాలో ఎప్పుడో అడుగు పెట్టిన ఇప్పుడు హైదరాబాద్‌పై ఫోకస్‌ పెట్టడం వెనుక కూడా లాజిక్‌ ఉంది..

ప్రీమియం మార్కెట్‌లోకి హైదరాబాద్‌

రియల్ బిజినెస్‌ పరంగా చూస్తే..మన దేశంలో.. ఢిల్లీ, ముంబయ్‌, ప్రీమియమ్‌ మార్కెట్స్‌..సెకండ్‌ గ్రేడ్‌లో బెంగళూరు, హైదరాబాద్, అమృత్‌సర్‌, పుణె, చెన్నై నగరాలున్నాయి. ఒక Square ఫీట్‌ 12న్నర వేలు దాటితే దాన్ని ప్రీమియం మార్కెట్‌ కింద చూస్తారు.. అంతకు లోపే ఉంటే అది సెకండ్‌ మార్కెట్‌గా పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది ఫస్ట్‌ టైమ్‌ మన హైదరాబాద్‌లోని కోకాపేటలో ఒక Square ఫీట్‌ 15 వేలను తాకింది. దీంతో హైదరాబాద్‌ మార్కెట్‌ ప్రీమియం మార్కెట్‌ రేటింగ్‌ను టచ్‌ చేసింది. దీంతో.. భాగ్యనగరం రియల్‌ మార్కెట్‌ బెంగళూరును వెనక్కి తోసి..ఢిల్లీ, ముంబయ్‌, సరసన చేరింది. ఇదే ట్రంప్‌ హైదరాబాద్‌లో అడుగు పెట్టడానికి కారణమని మార్కెట్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సో.. ఇకపై హైదరాబాద్‌ రియల్‌ వెంచర్‌ మార్కెట్‌ స్కై లిమిట్‌ అన్నట్లుగా ఉంటుందేమో..మరి.. లోకల్‌ రియల్టర్లు ట్రంప్‌ రాకను ఎలా ఫేస్‌ చేస్తారో..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..