Pakistan: 54 మంది పిల్లల తండ్రి అబ్దుల్ మజీద్ మంగళ్‌ మృతి.. తండ్రి కష్టాన్ని, ప్రేమని గుర్తు చేసుకుంటున్న పిల్లలు

తన తండ్రి మరణంపై అబ్దుల్ మజీద్ కుమారుడు షాహ్ వలీ స్పందిస్తూ.. తమ అవసరాలను తీర్చడం కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారని చెప్పాడు. వాస్తవానికి 54 మంది పిల్లలను పెంచడం అంత సులభం కాదు.. తన పిల్లల చదువు, ఆలనాపాలన కోసం రకరకాల పనులు చేసేవారని గుర్తు చేసుకున్నాడు.

Pakistan: 54 మంది పిల్లల తండ్రి అబ్దుల్ మజీద్ మంగళ్‌ మృతి.. తండ్రి కష్టాన్ని, ప్రేమని గుర్తు చేసుకుంటున్న పిల్లలు
Abdul Majeed Mangal
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2022 | 5:37 PM

54 మంది పిల్లలకు తండ్రి, అతిపెద్ద కుటుంబ పెద్ద హాజీ అబ్దుల్ మజీద్ మంగళ్‌ బుధవారం రాత్రి కన్నుమూశారు. మీడియా నివేదికల ప్రకారం.. అబ్దుల్ మజీద్ మంగళ్‌ గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్ట్ కారణంగా 75 సంవత్సరాల వయస్సులో మరణించాడు. అబ్దుల్ మజీద్ మంగళ్‌కు 6 మంది భార్యలు, 54మంది పిల్లలు ఉన్నారు. డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అబ్దుల్ మజీద్ మంగళ్‌ఆఫ్ఘనిస్థాన్‌కు ఆనుకుని ఉన్న బలూచిస్థాన్‌లోని నోష్కీ జిల్లాలోని కలి మంగళ్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు.

అయితే ప్రస్తుతం అబ్దుల్ మజీద్ మంగళ్‌కు ప్రస్తుతం 42 మంది పిల్లలు, నలుగురు భార్యలు ఉన్నారు. నివేదిక ప్రకారం.. అతని 12 మంది పిల్లలు, ఇద్దరు భార్యలు మరణించారు. 42 మంది పిల్లల్లో 22 మంది బాలురు, 20 మంది బాలికలు. మనవాళ్లను కలుపుకుంటే 150 మందితో కూడిన అతి పెద్ద కుటుంబం. అబ్దుల్ మజీద్ మంగళ్‌ 18 సంవత్సరాల వయస్సులో మొదటిసారి వివాహం చేసుకున్నాడు. హాజీ గ్రామం క్వెట్టా నుండి 130 కిలోమీటర్ల దూరంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉంది.

తన తండ్రి మరణంపై అబ్దుల్ మజీద్ కుమారుడు షాహ్ వలీ స్పందిస్తూ.. తమ అవసరాలను తీర్చడం కోసం తన తండ్రి ఎంతో కష్టపడ్డారని చెప్పాడు. వాస్తవానికి 54 మంది పిల్లలను పెంచడం అంత సులభం కాదు.. తన పిల్లల చదువు, ఆలనాపాలన కోసం రకరకాల పనులు చేసేవారని గుర్తు చేసుకున్నాడు. ఒక్క రోజు కూడా పని చేయడానికి బద్దకించలేదని.. తమలో కొందరు డిగ్రీ వరకూ చదువుకున్నరని పేర్కొన్నాడు. గత వరదల్లో తమ ఇల్లు ధ్వసం అయినా ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని.. ప్రభుత్వం తమని ఆదుకోవాలని షాహ్ వాలీ విజ్ఞప్తి చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

జాతీయ జనాభా గణన 2017 ప్రారంభించినప్పుడు అబ్దుల్ మజీద్..  అతని కుటుంబం మొదట సారిగా వెలుగులోకి వచ్చింది.  అధికారులు అబ్దుల్ మజీద్ మంగళ్‌ గురించి పూర్తి విచారణ చేసి.. అసలు విషయం తెలిసి వారు ఉలిక్కిపడ్డారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..