AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Airstrikes: పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్‌..!

Pakistan Airstrikes: పాకిస్తాన్ వైమానిక దళం ఎఫ్-16, జేఎఫ్-17 థండర్ యుద్ధవిమానాలను వినియోగించినట్లు సమాచారం. బర్మల్ జిల్లా మార్ఘా ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బనూసి మద్రసాపై కూడా క్షిపణి దాడి జరిగినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ లేదు..

Pakistan Airstrikes: పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్‌..!
Pakistan Airstrikes
Subhash Goud
|

Updated on: Feb 22, 2026 | 8:48 AM

Share

Pakistan Airstrikes: ఆఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ దాడులకు దిగింది. ఉగ్రవాదులే లక్ష్యంగా సరిహద్దుల్లోని ప్రాంతాలపై వైమానిక దాడులు చేపట్టింది. ఇటీవల ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి నేపథ్యంలో తాజాగా ఈ దాడులు నిర్వహించింది. నంగర్హార్‌, పాక్టికా ప్రావిన్స్‌లలో నిన్న రాత్రి తమ పౌరుల నివాసాలపై పాక్‌ దాడి చేసిందని, ఈ ఘటనలో డజన్ల కొద్దీ చనిపోయారని అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రతినిధి పేర్కొన్నారు. దాడి ఘటనను పాకిస్థాన్‌ ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వైమానిక దాడులపై అఫ్గాన్ తాలిబాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతీకార హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాలిబాన్ నాయకత్వానికి సమీప వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు – ఆగ్నేయ అఫ్గానిస్తాన్‌లో పాకిస్తాన్ జరిపిన దాడుల్లో కనీసం 28 మంది టిటిపి (Tehreek-e-Taliban Pakistan) యోధులు మరణించినట్లు సమాచారం.

“పాకిస్తాన్ దాడులను మేము సమీక్షిస్తున్నాం. నష్టాల స్థాయిని అంచనా వేస్తున్నాం,” అని తాలిబాన్ వర్గాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ అఫ్గాన్ గగనతలాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ, “మాకు ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉంది” అని స్పష్టం చేశాయి. తక్షణ ప్రతిస్పందన ప్రకటించకపోయినా, “సరైన సమయంలో మేము ప్రతిదాడి చేస్తాం” అని హెచ్చరించాయి.

ఈ ఘటనల నేపథ్యంలో కాబూల్, కందహార్‌లో అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. పాకిస్తాన్‌తో ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించిందని తాలిబాన్ ఆరోపిస్తూ, మధ్యవర్తులైన Saudi Arabia, Qatar, Türkiyeలకు ఈ విషయం తెలియజేస్తున్నట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇకపోతే పాకిస్తాన్ భద్రతా వర్గాల ప్రకారం, ఈ సరిహద్దు దాడులు ఉగ్రవాద మౌలిక వసతులపై లక్ష్యంగా జరిపిన ఖచ్చితమైన ఆపరేషన్‌గా పేర్కొన్నారు. పక్తికా, పక్తియా, నంగర్హార్, ఖోస్ట్ ప్రావిన్సుల్లో ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు.

పాకిస్తాన్ వైమానిక దళం ఎఫ్-16, జేఎఫ్-17 థండర్ యుద్ధవిమానాలను వినియోగించినట్లు సమాచారం. బర్మల్ జిల్లా మార్ఘా ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. బనూసి మద్రసాపై కూడా క్షిపణి దాడి జరిగినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక నిర్ధారణ లేదు.

Gold Price Today: బంగారం, వెండికి బ్రేకులు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ ఎంతంటే..

ఇటీవలి కాలంలో ఇస్లామాబాద్, బజౌర్, బన్నూ ప్రాంతాల్లో జరిగిన ఆత్మాహుతి దాడులకు టిటిపి, Islamic State – Khorasan Province (ఐఎస్కేపీ) బాధ్యత వహించాయని పాకిస్తాన్ ఆరోపించింది. ఈ దాడులకు అఫ్గాన్ భూభాగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద గుంపులే కారణమని, అఫ్గాన్ అధికారులను పలుమార్లు హెచ్చరించినట్లు తెలిపింది.

ఇక బన్నూ జిల్లాలో ఇంటెలిజెన్స్ ఆధారంగా చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించారు. భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పేర్కొన్నాయి. వాహనంతో చేసిన ఆత్మాహుతి దాడిని అడ్డుకునే ప్రయత్నంలో పేలుడు సంభవించడంతో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు అఫ్గాన్-పాక్ సరిహద్దులో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి: SBI Home Loan: మీరు ఎస్‌బీఐలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి? పూర్తి జాబితా!

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్
కూతురిని పరిచయం చేసిన బిగ్ బాస్ అర్జున్ అంబటి.. ఎమోషనల్ పోస్ట్