Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nostradamus 2023: నోస్ట్రడమస్ 2023పై అంచనాలు.. ‘మహా యుద్ధం’ గ్లోబల్ వార్మింగ్ నుంచి ధనవంతులపై తిరుగుబాటు వరకు

రెండవ ప్రపంచ యుద్ధం , హిట్లర్ అధికారంలోకి రావడం , ఫ్రెంచ్ విప్లవం వంటి అనేక విషయాలు నిజం అయ్యాయి. అంతేకాదు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య చేయబడతారని, న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 9/11 ఉగ్రవాద దాడులు జరుగుతాయని ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్‌ ముందే అంచనావేశారు. అయితే తాజాగా నోస్ట్రడామస్‌  2023లో జరగనున్న విషయాల గురించి కొన్ని అంచనాలు వేశారు. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం.. 

Nostradamus 2023: నోస్ట్రడమస్ 2023పై అంచనాలు.. 'మహా యుద్ధం' గ్లోబల్ వార్మింగ్ నుంచి ధనవంతులపై తిరుగుబాటు వరకు
Nostradamus Predictions For 2023
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2022 | 3:13 PM

తామున్న కాలం నుంచి భవిష్యత్ లో సంభవించే అనేక పరిణామాలు, పరిస్థితుల గురించి ముందే ఊహించి చెప్పేవారు భ్యవిష్యకారులు.. వారు రాసిందే భవిష్యవాణి.. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, బాబా వంగ, నోస్ట్రడామస్‌ లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన తత్వవేత్తలు. ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్‌ తనదైన శైలిలో ప్రపంచంలో రానున్న రోజుల్లో ఏమి జరగనున్నదో ముందే అంచనావేశారు. ఈ తత్వవేత్త  కొన్ని శతాబ్దాల క్రితం ‘లెస్ ప్రాఫెటీస్’ అనే పుస్తకంలో ప్రపంచానికి సంబంధించిన చాలా విషయాలను వివరించారు. ఈ పుస్తకం మొదటి ఎడిషన్ 1555 లో వచ్చింది. ఈ పుస్తకంలో భవిష్యత్ కు సంబంధించి మొత్తం 6338 విషయలు ఉన్నాయి, వాటిలో 70 శాతం దాకా వాస్తమేనని తేలింది. ఆయన ప్రిడిక్షన్స్‌ను ‘క్వాట్రెయిన్స్’ అని అంటారు.  ఈ  పుస్తకంలోని రెండవ ప్రపంచ యుద్ధం , హిట్లర్ అధికారంలోకి రావడం , ఫ్రెంచ్ విప్లవం వంటి అనేక విషయాలు నిజం అయ్యాయి. అంతేకాదు జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య చేయబడతారని, న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 9/11 ఉగ్రవాద దాడులు జరుగుతాయని ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రడామస్‌ ముందే అంచనావేశారు. అయితే ఆయన తాను అంచనాలు వేసిన విషయాల గురించి నిర్దిష్ట తేదీలను సూచించలేదు. అయితే తాజాగా నోస్ట్రడామస్‌  2023లో జరగనున్న విషయాల గురించి కొన్ని అంచనాలు వేశారు. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..

‘గొప్ప యుద్ధం’ 2023కి సంబంధించిన మొదటి అంచనాలలో ఒకటి ‘గొప్ప యుద్ధం’. “ఏడు నెలల గొప్ప యుద్ధం సాగుతుంది. ఈ యుద్ధం ద్వారా అనేక మంది ప్రజలు మరణిస్తారని పేర్కొన్నాడు. అయితే  ఈ అంచనా ఉక్రెయిన్ , రష్యా మధ్య ప్రస్తుత సంఘర్షణకు సూచన కావచ్చు. ఇది వచ్చే ఏడాది 3వ ప్రపంచ యుద్ధానికి కారణం అవుతుంది. అమెరికా , రష్యాతో సహా అనేక దేశాలు అణు ఆయుధాలతో యుద్ధానికి దిగే అవకాశం ఉండనుంది. ఈ 3వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో.. ఫ్రెంచ్ నగరం రూయెన్ సురక్షితంగా ఉంటుందని, పారిస్ ప్రమాదంలో పడవచ్చని అంచనా వేశారు.

భయానక అగ్ని విస్ఫోటనం: నోస్ట్రాడమస్ మరొక అంచనా ” రాచరిక భవనంపై ఖగోళ అగ్ని విస్ఫోటనం “ని సూచించాడు.  ఈ అగ్ని విస్ఫోటనం తరవాత నాగరికత  బూడిద నుండి ఒక కొత్త ప్రపంచ క్రమంగా ఉద్భవించిందని.. మనకు తెలిసిన అనేక సమరాలకు ముగింపుకు కారణమవుతుందని సూచించారు.

ఇవి కూడా చదవండి

మార్స్ ల్యాండింగ్ 2023లో మానవులు అంగారక గ్రహంపై దిగవచ్చు. నోస్ట్రడమస్ తన భవిష్యవాణి పుస్తకంలో “అంగారకుడిపై కాంతి పడటం” గురించి కూడా ప్రస్తావించాడు. గ్రహం తిరోగమనంలోకి వెళ్లి ఆకాశంలో వెనుకకు కదులుతున్నట్లు మనం భావించవచ్చు. స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు, కొత్త ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్ 2029 నాటికి మానవులు అంగారక గ్రహంపై నివసిస్తారని ఎప్పుడో సూచించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు దశాబ్దం ముగిసేలోపు అంగారక గ్రహాన్ని వలసరాజ్యం చేయాలని కోరుకుంటున్నట్లు కూడా చెప్పాడు.

ఆర్థిక విపత్తు 2023లో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు. కోవిడ్ -19 మహమ్మారి, ఉక్రెయిన్‌లో ప్రస్తుత యుద్ధం తరువాత , ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. ఇప్పటికే ప్రస్తుతం చాలా దేశాలు సమస్యాత్మక పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఈ ఫ్రెంచ్ జ్ఞాని తన పుస్తకంలో ఇలా వ్రాశాడు.. మనిషి తన తోటి మనిషిని తింటాడు’. జీవన వ్యయాల కారణంగా ఆర్థిక సంక్షోభం నిరాశ , కలహాలకు కారణమవుతుందని ఈ అంచనా సూచిస్తుంది. ప్రస్తుతం UKలో, కుటుంబాలు జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.  రాకెటింగ్ ఇంధన బిల్లులు , ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణం ,పెరుగుతున్న ఆహార ధరలను 2023లో మరింత ఆర్ధిక విపత్తును ఎదుర్కొన వచ్చు అని నోస్ట్రాడమస్ తెలిపారు.

గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ 2023లో మరింత తీవ్రమవుతుంది. గ్లోబల్ వార్మింగ్ అంశం కొత్తేమీ కానప్పటికీ, నోస్ట్రాడమస్ అంచనాల ప్రకారం, 2023లో మరింత ఉష్ణోగ్రత పెరగనుంది. అంతేకాదు సముద్ర మట్టాలు పెరగవచ్చు. “సూర్యుడు ప్రకాశించడంతో సముద్రం తలవంచుతుంది. వేడికి నల్ల సముద్రంలోని చేపలన్నీ మరణిస్తాయి. ” గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయి. సముద్ర మట్టాలు పెరగడంతో సముద్ర జీవులు మరణిస్తాయి. వీటి ప్రభావం ఆహార గొలుసుపై సమస్యలు ఏర్పడవచ్చు.  ఇంకా చెప్పాలంటే 2023 ఉష్ణోగ్రతలు బ్రేకింగ్ పాయింట్‌కి చేరుకునే సంవత్సరం కాబోతుందా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

పెరుగుతున్న పౌర అశాంతి స్థాయి  అంచనాల ప్రకారం 2023లో ప్రజలు తమ పాలకులపై తిరుగుబాటు చేసి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు . ప్రస్తుత జీవన వ్యయ సంక్షోభం , గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నందున  2023లో పౌర అశాంతి స్థాయిలు పెరగవచ్చు. నోస్ట్రాడమస్ అంచనా ప్రకారం   “త్వరలో, తరువాత  ప్రజల జీవితంలో వచ్చే మార్పులు, భయంకరమైన పరిస్థితులకు దారితీస్తాయని.. ప్రతీకారాలు చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడినప్పుడు సంపన్నులపై తిరుగుబాటు జరగవచ్చని ఈ అంచనా సూచిస్తుంది. హింస , అసమ్మతి సంపన్నులపై ఏర్పడొచ్చని అంచనావేశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..