పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని మాంటిసోరి పాఠశాలలో ఫిబ్రవరి 22న అంతర్జాతీయ కవలల దినోత్సవం ఘనంగా జరిగింది. ఒకే రకమైన దుస్తులు, పోలికలతో 30 మంది కవలలు ఒకేచోట చేరి సందడి చేశారు. స్థానికులు, సందర్శకులు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందించారు. పాఠశాల యాజమాన్యం మొక్కలు, స్వీట్లు పంపిణీ చేసి కవలల ప్రత్యేక అనుబంధాన్ని కొనియాడింది.