AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAN Card: పాన్ కార్డుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..? ఈ కార్డుకు మరింత ప్రత్యేకత..

ఇండియాలో నివసించే ప్రతీఒక్కరికీ పాన్ కార్డు అనేది అవసరమే. ఆర్థిక లావాదేవీల నిర్వహణకు ఇది అత్యంత అవసరమైన డాక్యుమెంట్. పాన్ కార్డు లేకపోతే మీరు ఎలాంటి ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించలేరు. దీంతో పాన్ కార్డును ప్రతీఒక్కరూ తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన అవసరముంది.

PAN Card: పాన్ కార్డుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా..? ఈ కార్డుకు మరింత ప్రత్యేకత..
Pan Card
Venkatrao Lella
|

Updated on: Feb 23, 2026 | 2:35 PM

Share

ఇండియాలో ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణకు పాన్ కార్డు అనేది తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేంతవరకు ఇది ఖచ్చితంగా అవసరం. ఇక మీరు నెలవారీ జీతం పొందాలన్నా ఈ డాక్యుమెంట్ అవసరమే. ఇలా పాన్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ అవసరమైన గుర్తింపు ధృవీకరణ పత్రంగా మారిపోయిందని చెప్పవచ్చు. ఏ ఆర్ధిక లావాదేవీ నిర్వహించాలన్నా పాన్ కార్డు అనేది ఉండాలి. ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ఈ కార్డ్ సంస్థలు, వ్యక్తులకు ప్రత్యేకమైన వ్యక్తిగత గుర్తింపుగా పని చేస్తుంది. పన్ను సమాచారం, ఆర్ధిక కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

పాన్ కార్డు అంటే ఏంటి..?

పాన్ అనగా పర్మినెంట్ అకౌంట్ నెంబర్ అని అర్ధం. దీనిని ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. ఆర్ధిక లావాదేవీలు, పన్ను వ్యవస్థలో పారదర్శకతను కాపాడుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశంలో అత్యంత చట్టబద్దమైన గుర్తింపు పత్రం ఇది. పాన్ కార్డులను తరచుగా వాడుతూ ఉంటాం. పాన్ కార్డు నెంబర్ 10 అంకెలు మాత్రమే ఉంటుంది. ఈ 10 అంకెల నెంబర్‌లో ఒక్కొ వర్డ్‌కు ఒక్కో అర్ధం ఉంది. ప్రతీ అక్షరం, ప్రతీ సంఖ్యకు ఒక నిర్దిష్టమైన అర్థం, ఉద్దేశం ఉంది.

10 అంకెలకు మీనింగ్ ఏంటి..?

-మొదటి మూడు అక్షరాలు AAA నుంచి ZZZ వరకు యాదృచ్చిక అక్షరాలు -నాల్గొ అక్షరం కార్డుదారుడి వర్గాన్ని సూచిస్తుంది. పీ అంటే వ్యక్తిని సూచిస్తుంది. ఎఫ్ అంటే సంస్థను సూచిస్తుంది -ఐదో అక్షరం హోల్డర్ చివరి పేరు, ఇంటి పేరు మొదటి అక్షరాన్ని సూచిస్తుంది -దీని తర్వాత 0001 నుండి 9999 వరకు నాలుగు అంకెలు ఉంటాయి -ఇక చివరి అక్షరం ఒక అక్షరం లేదా సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది

పాన్ కార్డు ఎన్ని రకాలు..?

పాన్ కార్డుల్లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి. వ్యక్తిగత పాన్ కార్డు లేదా కంపెనీ పాన్ కార్డ్ అని ఉంటాయి. ఐటీఆర్ దాఖలు చేయడానికి, వ్యక్తిగత పెట్టుబడులు, బ్యాంకింగ్‌కు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు వ్యక్తిగత పాన్ కార్డ్ అవసరం. కంపెనీల పన్ను చెల్లింపులు, ఆర్ధిక లావాదేవీలకు ప్రత్యేకమైన పాన్ కార్డ్ అవసరం. దీనిని సంస్థ పాన్ కార్డుగా పిలుస్తారు. కంపెనీల లావాదేవీలు అన్నీ దీని ద్వారా ట్రాక్ చేయబడతాయి. ఇలా ఇండియాలో రెండు రకాల పాన్ కార్డులు జారీ చేస్తారు.

Follow Us