ఆన్‌లైన్‌లో పీఎఫ్ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం ఎలా..?
Venkatrao Lella
Images: Pinterest
12 JUNE 2026
ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి పీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. పీఎఫ్ ప్రొఫైల్‌లో మీ వివరాలు ఒకవేళ తప్పుగా ఉంటే సులభంగా ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఇంది వద్ద నుంచే మొబైల్ ద్వారా సవరించుకుకోవచ్చు.
పీఎఫ్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను అప్డేట్ చేసుకోవడం ఇప్పుడు మరింత సులభమైంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ప్రక్రియను సులభతరం చేసింది. దీని ద్వారా ఆధార్ ధృవీకరించబడిన UAN ఉన్న సభ్యులు తమ ప్రొఫైల్‌లను అప్డేట్ చేసుకోవచ్చు.
దశ1: తొలుత EPFO అధికారిక వెబ్‌సైట్ www.epfindia.gov.inను సందర్శించండి.
మీ UAN, పాస్‌వర్డ్, క్యాప్చాను ఉపయోగించి లాగిన్ చేయండి.
దశ 2: మోనూ నుంచి 'మేనేజ్' ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆ తర్వాత 'ప్రాథమిక వివరాలను సవరించు' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
దశ 3: ఆ తర్వాత మీ ఆధార్ కార్డు ప్రకారం మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 'ట్రాక్ రిక్వెస్ట్' ఆప్షన్‌ను ఉపయోగించి మీ ప్రొఫైల్ అప్‌డేట్ స్టేటస్ ట్రాక్ చేయవచ్చు
ఈపీఎఫ్‌వో ప్రొఫైల్ వివరాలు కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే సేవలు పొందటంలో మీకు ఇబ్బందులు రావొచ్చు. అందుకే మీ వివరాలు ఒకసారి చెక్ చేసుకోండి.
ప్రొఫైల్‌లో ఏమైనా తప్పులు ఉంటే వెంటనే మార్చుకోవడం మంచిది. లేదా మీరు క్లెయిమ్ కోసం అప్లై చేసినప్పుడు సమస్యలు తెలెత్తే అవకాశముంటుంది. అలాగే పాస్ బుక్ యాక్సెస్ చేయడంలో కూడా ఇబ్బందులు రావొచ్చు
మీ పేరు, తండ్రి పేరు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ లాంటి అన్నీ వివరాలను మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అవకాశం కల్పి్స్తోంది. ఎప్పటినుంచో ఈ సదుపాయం ఉంది.