AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Living Nostradamus: భవిష్యవాణి చెప్పడంలో ‘అభినవ నోస్తాడమస్’ గురించి తెలుసా? 2023పై సంచలన విషయాలు వెల్లడి

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల భవిష్యత్తు గురించి పేర్కొన్నాడు. రాజకుటుంబం నుండి విడిపోయిన ఈ జంట భవిష్యత్తు రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అథోస్ సలోమ్ ఊహించాడు.

Living Nostradamus: భవిష్యవాణి చెప్పడంలో 'అభినవ నోస్తాడమస్' గురించి తెలుసా? 2023పై సంచలన విషయాలు వెల్లడి
Nostradamus Predictions 2023
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 12, 2022 | 3:08 PM

Share

బాబా వంగ, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వలే నోస్ట్రడామస్ కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. నోస్ట్రడామస్ వేసిన  అంచనాలు..  కొన్నిసార్లు భయపెట్టేవిగా ఉంటే.. మరి కొన్నిభవిష్యత్ లో జరిగే పరిణామాల గురించి హెచ్చరికగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నోస్ట్రడామస్  చెప్పిన విషయాలు నిజ జీవితంలో జరగగా.. మరికొన్నింటిలో తప్పుగా నిరూపించబడ్డాయి. అయినప్పటికీ  నోస్ట్రడామస్ భవిష్యత్తు గురించి ఏదైనా చెప్పినట్లయితే, దానిని విస్మరించలేము. అడాల్ఫ్ హిట్లర్ ఎదుగుదల నుండి మాజీ US ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నెడీ హత్య వరకు అనేక సంఘటనలను నోస్ట్రాడమస్ ఊహించాడు. ఈ రోజు మన మధ్య నోస్ట్రడామస్ లేరు..అతనిని గొప్ప వ్యక్తిగా భావించి కీర్తిస్తున్నారు. అయితే ఇప్పుడు వింగ్ నోస్ట్రడామస్ గా అథోస్‌ ఖ్యాతిగాంచాడు. 

మీడియా నివేదికల ప్రకారం..  బ్రెజిల్ కు చెందిన 36 ఏళ్ల అథోస్ సలోమ్ ‘స్వయం ప్రకటిత ప్రవక్త’. అతను ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల భవిష్యత్తు గురించి పేర్కొన్నాడు. రాజకుటుంబం నుండి విడిపోయిన ఈ జంట భవిష్యత్తు రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అథోస్ సలోమ్ ఊహించాడు. ప్రజలు అథోస్‌ను ‘లివింగ్ నోస్ట్రడామస్ ‘ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో జరిగిన జరుగుతున్న కరోనా మహమ్మారి, క్వీన్ ఎలిజబెత్ II మరణం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి , ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేయడం వంటి అనేక సంఘటనలను గురించి 36 ఏళ్ల అథోస్ సలోమ్  ఖచ్చితంగా అంచనా వేసినట్లు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

హ్యారీ, మేఘన్ దంపతుల గురించి ఏం చెప్పాడంటే? 36 ఏళ్ల అథోస్ సలోమ్ ప్రకారం.. ప్రిన్స్ హ్యారీకి వచ్చే ఏడాది జీవితంలో పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. వచ్చే వేసవిలో హ్యారీ జీవితంలో ఒక బాంబు పేలనుంది. వచ్చే నెల నుంచి ప్రిన్స్  జీవితంలోని చక్రాలు కదలడం మొదలవుతాయి. యువరాజు విషయాలు తిరిగి ట్రాక్‌లోకి వస్తాయి.

అయితే మేఘన్‌ జీవితంలో పెద్ద మార్పులేవీ రావని.. ఆ సమయంలో ఆమె “చరిత్రగా మారుతుంది” అని అథోస్ పేర్కొన్నాడు. బ్రిటిష్ టాబ్లాయిడ్ ప్రకారం.. 2022 జనవరి నుంచి మార్చి మధ్య హ్యారీ జీవితం మారుతుందని అథోస్ పేర్కొన్నాడు. ప్రపంచం నలుమూలల నుండి మనస్తత్వవేత్తలు తన వద్దకు నేర్చుకునేందుకు వస్తున్నారని గతంలో అథోస్ చెప్పాడు. ఇతరులకు లేని శక్తులు తనకు ఉన్నాయని 12 ఏళ్ల వయసులో తాను మొదట గ్రహించానని అథోస్ చెప్పాడు. ఈ విషయం చెప్పి తాను నవ్వులపాలు కావడం ఇష్టంలేక దాచిపెట్టినట్లు పలు సందర్భాల్లో వెల్లడించాడు. అయితే ఇప్పుడు తన సామర్థ్యాలకు తగ్గట్టుగా తాను మారినట్లు వెల్లడించాడు  36 ఏళ్ల అథోస్ సలోమ్. తనను ప్రజలు ‘వెర్రి’ అని పిలుస్తారనే భయంతో తమ సామర్థ్యాలను లోకానికి తెలియనివ్వడం లేదని.. తనకు అనేక మంది వ్యక్తుల భవిష్యత్ గురించి చాలా సందేశాలు వస్తాయని అథోస్ చెప్పాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..