AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card Rules: క్రెడిట్ కార్డులు వాడేవారందరికీ బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై కఠిన నిబంధనలు

ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డు నియమాల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. క్రెడిట్ కార్డ్స్ వాడేవారందరూ వీటి గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరముంది. ఇక నుంచి క్రెడిట్ కార్డు బిల్లులపై కూడా ఐటీ శాఖ నిఘా ఉండనుంది. వీటి గురించి తెలుసుకుందాం.

Credit Card Rules: క్రెడిట్ కార్డులు వాడేవారందరికీ బిగ్ అలర్ట్..  ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై కఠిన నిబంధనలు
Credit Cards
Venkatrao Lella
|

Updated on: Feb 23, 2026 | 3:02 PM

Share

రోజువారీ ఖర్చులు, ఆన్ లైన్ షాపింగ్, అత్యవసర సమయంలో ఇతర ఆర్ధిక విషయాల్లో ఉపయోగపడుతుందనే కారణంతో చాలామంది క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటారు. కొంతమంది లక్షల్లో లిమిట్ కలిగిన క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా క్రెడిట్ కార్డులు వాడే వారందరికీ అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి క్రెడిట్ కార్డు రూల్స్‌లో భారీ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఐటీ శాఖ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డు చెల్లింపులు, బిల్లు చెల్లింపులపై నిఘా పెట్టేందుకు కఠిన రూల్స్ తీసుకొస్తుంది. ముఖ్యంగా ఐదు కీలక మార్పులు రానున్నాయి. ఈ మేరకు ఇన్‌కమ్ ట్యాక్స్ 2026 మసాయిదాలో వీటిని ఐటీ శాఖ పొందుపర్చింది. 1962లో తీసుకొచ్చిన నిబంధనలను సవరించింది కొత్త గైడ్‌లైన్స్ తీసుకురాబోతుంది.

క్రెడిట్ కార్డు బిల్లులపై నిరంతర పర్యవేక్షణ

ఇక నుంచి క్రెడిట్ కార్డు బిల్లులపై ఐటీ శాఖ నిఘా నిరంతరం ఉండనుంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెల్లింపులు క్రెడిట్ కార్డుల నుంచి చేస్తే బ్యాంకులు లేదా కార్డులు జారీ చేసే సంస్థలు ఈ విషయాన్ని ఐటీ శాఖకు రిపోర్ట్ చేయాలి. ఇక రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డు బిల్లు నగదు రూపంలో చెల్లించినా ఐటీ శాఖకు చెప్పాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లుల్లో్ పారదర్శకత కోసం ఐటీ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

పాన్ కార్డుకు అప్లై చేస్తే..

ఇక పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌ను కూడా చిరునామా రుజువుగా సమర్పించవచ్చు. కొత్తగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఇది ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇక డాక్యుమెంట్ సేకరణ ప్రక్రియను కూడా సులభతరం చేస్తుంది.

క్రెడిట్ కార్డు ద్వారా ట్యాక్స్ చెల్లింపులు

ఇక నుంచి క్రెడిట్ కార్డు ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించవచ్చు. ఈ మేరకు డిజిటల్ విధానంలో క్రెడిట్ కార్డు ద్వారా ట్యాక్సులు చెల్లించవచ్చు. గతంలో డెబిట్, నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు క్రెడిట్ కార్డులను కూడా ఇందులో చేర్చారు. అయితే క్రెడిట్ కార్డుద ద్వారా చెల్లించే సమయంలో వడ్డీ, ఛార్జీల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డు పొందాలంటే..?

ఇకపై క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నప్పుడు తప్పనిసరిగా పాన్ కార్డును అందించాలి. పాన్ లేకపోతే క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి వీలు పడదు. నకిలీ ఖాతాలను అరికట్టడం, పన్ను వ్యవస్థకు అనుసంధానించేందుకు ఐటీ శాఖ ఈ నిబంధన తీసుకొచ్చింది.

కంపెనీ క్రెడిట్ కార్డు జారీ చేస్తే..

కంపెనీ జారీ చేసే క్రెడిట్ కార్డు ఉద్యోగి పొంది ఉంటే.. ఆ కార్డుపై అయ్యే ఖర్చులను కంపెనీ చెల్లించి ఉంటే దానిని పెర్క్విజిట్‌గా పరిగణిస్తారు. వీటికి పన్ను విధించనున్నారు. ఖర్చులు అధికారిక ప్రయోజనల కసం మాత్రమే అయితే పన్ను మినహాయింపు ఉంటుంది.

Follow Us