PM Awas Yojana: సొంతిల్లు లేనివారికి కేంద్రం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకి రూ.1.50 లక్షలు..
కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా సొంతిల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా రూ.1.50 లక్షల సాయం అందిస్తోంది. వీటిని నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తోంది.

సొంతిల్లు లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని 2029 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కీమ్ కింద దేశంలో సొంతిల్లు లేనివారికి ఇంటి నిర్మాణానికి కేంద్రం ఆర్ధిక సాయం అందించనుంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదల ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఈ సాయం పొంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు సొంతిల్లు నిర్మించుకోవచ్చు. ఈ పథకానికి అర్హతలు ఏంటి? ఎలా లబ్ది పొందాలి..? దరఖాస్తు చేసుకోవడం ఎలా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అర్హతలు ఇవే..
-సొంతిల్లు ఉండకూడదు
-రేషన్ కార్డు కలిగి ఉండాలి
-దరఖాస్తుదారుడు తక్కువ ఆదాయ వర్గంలో ఉండాలి
-ఆధార్, రేషన్, పాన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, ఇన్ కమ్ సర్టిఫికేట్ వంటివి అందించాలి
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?
-pmaymis.gov.in అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి
-హోమ్ పేజీలో సిటిజన్ అసెస్‌మెంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-అప్లై ఆన్ లైన్ ఆప్షన్ ఎంచుకోండి
-ఆధార్ కార్డు నెంబర్, మీ పేరు నమోదు చేయండి
-చెక్ లేదా వెరిఫై ఆప్షన్ ఎంచుకోండి
-అనంతరం దరఖాస్తు ఫారం తెరుచుకుంటుంది
-రాష్ట్రం, జిల్లా, కుటుంబ పెద్ద పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్, వార్షిక ఆదాయం, బ్యాంక్ అకౌంట్ వివరాలు వంటివి నమోదు చేయండి
-క్యాప్చా కోడ్ నమోదు చేయండి
-సబ్మిట్ బటన్ నొక్కండి
-అనంతరం అసెస్మెంట్ లేదా అప్లికేషన్ నెంబర్ కనిపిస్తుంది
-స్టేటస్ తెలుసుకునేందుకు అప్లికేషన్ నెంబర్ సేవ్ చేసుకోండి
అప్లై చేసుకున్నాక ఏమవుతుంది..?
మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూరం నింపాక ప్రభుత్వ అధికారులకు వద్దకు వెళుతుంది. అధికారులు మీ అర్హతను పరిశీలించి ధృవీకరిస్తారు. మీరు అర్హత సాధిస్తే పీఎం ఆవాస్ యోజన లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. అనంతరం మీకు అకౌంట్లో నగదు జమ చేస్తారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం ఆవాస్ యోజన పథకంతో కలిపి గృహ నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతోంది. కేంద్రం అందించే సాయంతో పాటు అదనంగా మరికొంత సాయం పంపిణీ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుండగా.. ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది.
