విశాఖపట్నం సింధియా షిప్‌యార్డ్ సమీపంలోని ఓ పాడుబడిన పాఠశాలలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. స్థానికులు సమాచారం అందించగా, స్నేక్‌క్యాచర్ నాగరాజు రంగంలోకి దిగి ఎంతో శ్రమించి దాన్ని పట్టుకున్నారు. సురక్షితంగా పట్టుకున్న కొండచిలువను అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.