British Airways: విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు షాక్.. తినే ఆహారంలో దంతం.. ఇవి నా పళ్లు కావంటూ ట్వీట్

బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లోని ఓ ప్రయాణికురాలికి వడ్డించిన భోజనంలో కృత్రిమ దంతాలు కనిపించాయి. దీంతో ఆ పాసింజర్ తన ఫుడ్ ఫోటో తీసి.. బ్రిటీష్ ఎయిర్ వేస్ ని ట్యాగ్ చేస్తూ ఫోటోను ట్వీట్ చేశారు.

British Airways: విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు షాక్.. తినే ఆహారంలో దంతం.. ఇవి నా పళ్లు కావంటూ ట్వీట్
British Airways
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2022 | 12:41 PM

స్ట్రీట్ ఫుడ్ కంటే రెస్టారెంట్ ఫుడ్ శుభ్రంగా ఉంటుందని అందరూ భావిస్తారు.. అయితే ఒకొక్కసారి ఫైవ్ స్టార్ హోటల్స్ లోని ఫుడ్ లో కూడా రకరకాల పురుగులు కనిపించాయని కొందరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అయితే తాజాగా ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ న్యూస్ లో బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లోని ప్రయాణికులకు వడ్డించిన భోజనంలో కృత్రిమ దంతం  కనిపించాయి. దీంతో ఆ విమానంలోని ప్రయాణికురాలు ఫోటో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇలాంటి నివేదికలు చూసినప్పుడు.. ఖరీదు ఎక్కువగా ఉండే ప్లేసెస్ తో పాటు విమానంలో అందించే ఆహారం శుభ్రంగా ఉంటుందనే తమ భ్రమను ఈ పోస్ట్ తొలగించిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లోని ఓ ప్రయాణికురాలికి వడ్డించిన భోజనంలో కృత్రిమ దంతాలు కనిపించాయి. దీంతో ఆ పాసింజర్ తన ఫుడ్ ఫోటో తీసి.. బ్రిటీష్ ఎయిర్ వేస్ ని ట్యాగ్ చేస్తూ ఫోటోను ట్వీట్ చేశారు. ఈ ఘటన అక్టోబర్ 25 లండన్ నుండి దుబాయ్‌కి వెళ్తున్న విమానంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇది చాలా భయంకరమైన అనుభం నేను ఎయిర్ వేస్ కాల్ సెంటర్ నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి కాల్ ను రిసీవ్ చేసుకోలేదని ఆ ప్రయాణికురాలు చెప్పారు.

ఇవి కూడా చదవండి

‘అక్టోబర్ 25న..  లండన్ నుండి దుబాయ్‌కి ప్రయాణిస్తున్న BA107 విమానంలో నాకు ఇచ్చిన భోజనంలో ఈ కృత్రిమ దంతం కనిపించింది. ఇది నా పన్ను కాదు.. నా దంతాలన్నీ బాగానే ఉన్నాయని.. తాను ఈ దంతం చూసి నిజంగా భయపడ్డానని పేర్కొన్నారు  ప్రయాణికురాలు. నేను కాల్ సెంటర్‌ను సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను అని ట్వీట్ చేసింది.

బ్రిటీష్ ఎయిర్‌వేస్ వెంటనే స్పందిస్తూ, ‘ఈ విషయంపై మేము నిజంగా చింతిస్తున్నాము’ అని ట్వీట్ చేసింది. ఈ దంతం అన్నం, కూర ఉన్న ఆహారంలో దొరికింది. మహిళ ట్వీట్ చేయడంతో.. ఎయిర్‌వేస్ ఆమె వివరాలను సేకరించి క్షమాపణలు చెప్పింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

నేను డెంటల్ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ అని, ఈ కేసు గురించి నాకు చాలా ఆసక్తిగా ఉందని ఎవరో చెప్పారు. మరొకరు ఆ దంతం మొక్కజొన్నలా కనిపిస్తోందని అన్నారు. నేను ఈ ఎయిర్‌వేస్‌లో క్రమం తప్పకుండా ప్రయాణిస్తాను. ఇది తెలిసిన తర్వాత తనకు చాలా అసహ్యం కలుగుతోంది అని మరొకరు అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..