AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US – Iran Tensions: దాడులు జరగొచ్చు.. ఇరాన్‌ను విడిచి వెళ్లండి: భారత్ కీలక ప్రకటన..

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.. ఏ క్షణాన్నైనా ఇరు దాడులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.. ఈ క్రమంలో భారత్ కీలక ప్రకటన చేసింది. టెహ్రాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌ను విడిచి వెళ్లాలని భారత్ పౌరులను కోరింది. రాబోయే రోజుల్లో అమెరికా దాడులు జరగొచ్చన్న కారణంగా ఈ ప్రకటన చేసింది.

US - Iran Tensions: దాడులు జరగొచ్చు.. ఇరాన్‌ను విడిచి వెళ్లండి: భారత్ కీలక ప్రకటన..
Tehran Us Tensions
Shaik Madar Saheb
|

Updated on: Feb 23, 2026 | 2:04 PM

Share

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.. ఏ క్షణాన్నైనా ఇరు దాడులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.. ఈ క్రమంలో భారత్ కీలక ప్రకటన చేసింది. టెహ్రాన్-అమెరికా ఉద్రిక్తతల మధ్య ఇరాన్‌ను విడిచి వెళ్లాలని భారత్ పౌరులను కోరింది. రాబోయే రోజుల్లో అమెరికా దాడుల జరగొచ్చని.. దీని కారణంగా ఇరాన్‌లోని భారతీయులు.. దేశాన్ని విడిచి వెళ్లాలని భారత రాయబార కార్యాలయ అధికారులు సూచించారు. భారత రాయబార కార్యాలయం తన తాజా సలహాలో.. “వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచి వెళ్లాలని” పౌరులను కోరింది. ఈ సలహా ఇరాన్‌లోని విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు.. ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది..

“జనవరి 14, 2026 నాటి సలహా ఇందుమూలంగా పునరుద్ఘాటించబడుతోంది.. అందరు భారతీయ పౌరులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు (PIOలు) తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. నిరసనలు లేదా ప్రదర్శనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలి.. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి.. ఏవైనా పరిణామాల కోసం స్థానిక మీడియాను పర్యవేక్షించాలి” అని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

ఇరాన్‌లోని భారతీయులు తమ ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలు, పాస్‌పోర్ట్‌లు, IDలు సహా, తక్షణమే అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఏదైనా సహాయం కోసం వారు భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని అభ్యర్థించారు.

భారత రాయబార కార్యాలయం అత్యవసర నంబర్‌లు, ఇమెయిల్‌లను కూడా జారీ చేసింది: +989128109115; +989128109109; +989128109102; +989932179359. ఇమెయిల్: cons.tehran@mea.gov.in గా పేర్కొంది.. ఏదైనా సలహాల కోసం వీటిని సంప్రదించాలని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us