రోడ్డెక్కిన రాజకీయం.. చితికిపోతున్న వ్యాపారం.. కోర్టులో తేలాల్సిన వివాదం పొలిటికల్ దండయాత్రగా ఎలా మారింది..?
దేశ రాజధాని ఢిల్లీ.. ప్రజాస్వామ్యానికి పవర్ సెంటర్‌గా ఉండాల్సిన చోట.. ఇప్పుడు పొలిటికల్ పవర్ ఫైట్‌కు అడ్డాగా మారిపోయింది. చట్టసభల్లో చర్చ జరగాల్సిన అంశాలు.. న్యాయస్థానాల్లో తేలాల్సిన వివాదాలు.. చివరికి రోడ్ల మీదకు వచ్చేశాయి. ఎన్నికల సంఘం నిర్ణయాలపై ఇండియా కూటమి యుద్ధం ప్రకటిస్తే.. ఆ యుద్ధానికి దీటుగా బీజేపీ కూడా యాక్షన్‌లోకి దిగింది. ఒకరి నినాదం ఓట్ బచావో.. మరొకరి నినాదం లోక్‌తంత్ర బచావో. రెండు కూటములూ తగ్గేదేలే అన్నట్టుగా ఉంది వ్యవహారం. కానీ ఈ రాజకీయ రణరంగంలో అసలు నలిగిపోతున్నదెవరు? రెండు నెలలుగా హస్తినలో సాగుతున్న పొలిటికల్ సర్కస్‌కు ముగింపేలేదా ?

చట్టసభల్లో తేలాల్సిన పంచాయితీ.. రోడ్డెక్కింది.. యస్థానంలో ఉన్న వివాదం.. రాజకీయ యుద్ధంగా మారింది.. ఓట్ చోరీ అంటున్న విపక్షం.. లోక్‌తంత్ర బచావో అంటున్న అధికార పక్షం.. ఈ రాజకీయ యుద్ధానికి మొదట బీజం పడింది అక్టోబర్ 1న. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారం, ఎస్‌ఐఆర్ ప్రక్రియ, ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై చర్చించేందుకు ఇండి కూటమి ఢిల్లీలో సమావేశమైంది. ఎన్నికల సంఘంపై ఆరు ప్రధాన డిమాండ్లతో ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ ప్రకటించింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిరసనలకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 6న పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ఎంపీల భారీ మార్చ్ నిర్వహించింది. ఆకాశవాణి భవన్ దగ్గర సేవ్ డెమోక్రసీ నినాదాలతో హోరెత్తించింది. ఆ తర్వాత కూడా నిరసనలు ఆగలేదు. జంతర్‌మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, కనాట్ ప్లేస్ పరిసరాల్లో తరచూ ఆందోళనలు జరిగాయి. నవంబర్ 1న రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి భారీ ర్యాలీ నిర్వహించి సీఈసీ రాజీనామా డిమాండ్‌ను మరోసారి తెరపైకి తెచ్చింది. దీనికి కౌంటర్‌గా బీజేపీ కూడా లోక్‌తంత్ర బచావో పేరుతో దేశవ్యాప్త పాదయాత్రలు, నిరసనలకు శ్రీకారం చుట్టింది. అలా నెలకిందట మొదలైన నిరసనల పరంపర.. ఇప్పుడు రెండు రాజకీయ కూటముల మధ్య ప్రత్యక్ష పోరుగా టర్న్ అయింది. అసలు విపక్షాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. నెక్స్ట్ హియరింగ్ ఈనెల 17న జరగనుంది. దీనిపై దేశ అత్యున్నత ధర్మాసనం...
