ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం షాంపూర్ వద్ద తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. దట్టమైన పొగమంచు, అతివేగం కారణంగా కల్వర్టును ఢీకొని బస్సు వాగులో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.