Viral Video: ఫ్యామిలీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో తండ్రీకూతురు క్యూట్ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా

కుమార్తె  ఆనందంగా ఉండడం కోసం తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ప్రస్తుతం..అందమైన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యామిలీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఒక తండ్రి తన కూతురు ఆనందం కోసం ఆమెతో కలిసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండ్రి చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా..   

Viral Video: ఫ్యామిలీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో తండ్రీకూతురు క్యూట్ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా
Father Daughter Dance At Wedding
Follow us
Surya Kala

|

Updated on: Dec 14, 2022 | 7:16 PM

ఈ భూమి మీద ఎన్నో బంధాలు.. అయితే అన్ని బంధాల్లోకి వెరీ వెరీ స్పెషల్ తండ్రీకూతుళ్ల బంధం. వీరి అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. తండ్రీకూతుళ్ల అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వీరి బంధం గురించి ఎంత వర్ణించినా ఇంకా మిగిలే ఉంది అనిపిస్తుంది. కూతురు అంటే నాన్నకు మరో అమ్మ.. నాన్న అంటే.. తన కడుపున పుట్టని కొడుకు.. కూతురు పుట్టినప్పటి నుంచి ఆమె సంతోషం కోసం తండ్రులు ఏం చేయడానికైనా సిద్ధపడతారు.  కూతురుకి పెళ్లి చేయడం అనేది ప్రతి తండ్రి కల.. ఆ అందమైన రోజున తండ్రి పడే సంతోషం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అలాంటి తండ్రీ కూతుళ్ల బంధానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కుమార్తె  ఆనందంగా ఉండడం కోసం తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ప్రస్తుతం..అందమైన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యామిలీ వెడ్డింగ్ ఫంక్షన్‌లో ఒక తండ్రి తన కూతురు ఆనందం కోసం ఆమెతో కలిసి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తండ్రి చేసిన డ్యాన్స్ కు నెటిజన్లు ఫిదా..

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియో పాకిస్థాన్‌లో జరిగిన వివాహ వేడుకకు సంబంధించినది. ఇందులో తండ్రీకూతుళ్లు డ్యాన్స్ ఫ్లోర్‌ మీద ఒకే రిథమ్ తో డ్యాన్స్ చేస్తున్నారు. అమర్ జలాల్ గ్రూప్ ..  ఫరీద్‌కోట్‌ల ‘జెడ నాషా’ పాటపై ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లికి వచ్చిన అతిధులు తండ్రి కూతురు చేసిన అద్భుతమైన డ్యాన్స్ ను ఆస్వాదించడం వీడియోలో చూడవచ్చు. నెటిజన్లు ఈ వీడియోను బాగా ఇష్టపడుతున్నారు. చాలా ఆనందిస్తున్నారు.

తండ్రీకూతుళ్ల ఈ అందమైన నృత్య ప్రదర్శనను ఇన్‌స్టాగ్రామ్‌లో వాసిలా స్టూడియో అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో  క్షణ క్షణానికి వైరల్ అవుతోంది. ఇప్పటికే దాదాపు 6 వేల మంది లైక్ చేయగా, వీడియో 76 వేలకు పైగావీక్షించారు. ఇది చాలా అందమైన పాట. తండ్రీ కూతుళ్లిద్దరూ తమ డ్యాన్స్‌తో వేదికపై సునామీ సృష్టించారు. మీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ సూపర్బ్ అని తండ్రి కూతురు అంటే ఇదేగా అని మరొకిందరు కామెంట్ చేశారు. ఓవరాల్‌గా ఈ వీడియో అంటే ఇష్టపడుతున్నారు

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..