AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పొట్ట కూటికోసం ఇద్దరు చిన్నారుల విన్యాసాలు.. పట్టించుకోని జనం.. కన్నీరు పెట్టిన బాలిక..

ఇద్దరు చిన్నారులు రోడ్డు పక్కన విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ జనం వస్తూ పోతూనే ఉన్నారు. ఎవరూ ఆ చిన్నారుల దగ్గర ఆగి వారి ఫీట్స్ ను చూసి కొంత డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా లేరు.

Viral Video: పొట్ట కూటికోసం ఇద్దరు చిన్నారుల విన్యాసాలు.. పట్టించుకోని జనం.. కన్నీరు పెట్టిన బాలిక..
Viral Video
Surya Kala
|

Updated on: Dec 13, 2022 | 8:36 PM

Share

ప్రపంచంలో కొందరి జీవితం పూల పాన్పు.. మరికొందరి జీవితం ముళ్ల బాట. జీవితంలో అనేక సమస్యల భారంతో ఉన్నవారు.. తమ సమస్యలను తీర్చుకోవడనికి జీవితాన్ని జీవించడానికి అష్టకష్టాలు పడతారు. తమ సమస్యలు శాశ్వతంగా తీరిపోవాలని సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జీవితం ఒక పోరాటమని శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి జీవితంలో జీవించడానికి ఎప్పుడూ పోరాటం చేయాల్సి ఉంటుంది. మానవ రూపంలో దేవుడే భూమి మీదకు దిగి వచ్చినా.. అతను కూడా ప్రాపంచిక సవాళ్ల నుండి తప్పించుకోలేడు. ఇక సాధారణ మానవులమైన మనం ఎంత.. అయితే.. కొంతమంది జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. వటువంటి వారి కష్టాలను చూసి కొన్నిసార్లు ఇతరుల కళ్ళు కూడా తడిగా మారతాయి. ఈ రోజుల్లో అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో హృదయాన్ని కదిలిస్తుంది.

వాస్తవానికి ఈ వీడియోలో.. ఇద్దరు చిన్నారులు రోడ్డు పక్కన విన్యాసాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ జనం వస్తూ పోతూనే ఉన్నారు. ఎవరూ ఆ చిన్నారుల దగ్గర ఆగి వారి ఫీట్స్ ను చూసి కొంత డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా లేరు. అలాంటి పరిస్థితిలో ఢోలు వాయిస్తున్న ఓ అమ్మాయికి కూడా కన్నీళ్లు వచ్చాయి. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన ఏడుపు తన జీవితాన్ని సులభతరం చేయదని ఆ బాలిక గ్రహించినట్లు అనిపిస్తుంది వీడియో చూస్తుంటే.. ఆ బాలిక రోడ్డుకు అవతలి వైపు తన సోదరి గారడీ చేస్తున్నప్పుడు.. కన్నీరు నిండిన కళ్లతో ఢోలు వేయించడానికి తిరిగి వెళుతుంది. ఈ వీడియో చూస్తే ఎవరి కళ్ళు అయినా  కన్నీళ్లు పెట్టక మానవు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Gulzar_sahab అనే ఐడితో షేర్ చేయబడింది. ‘ఈ వీడియో తమ జీవితంలో సమస్యలు ఉన్నాయని భావించే వారి కోసం’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. కేవలం 24 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు వేలాది మంది వీక్షించారు. అదే సమయంలో.. ప్రజలు కూడా వీడియోను చూసిన తర్వాత వివిధ వ్యాఖ్యలు చేశారు. ఒక వినియోగదారు ఉద్వేగభరితంగా, ‘ఇది అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను’ అని రాశాడు, మరొక వినియోగదారు ‘ఎప్పటికీ బలహీనంగా ఉండకు.. జీవితంలో చెడు సమయాన్ని ఎదుర్కోవాలి.. దేవుడు మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని నేను ప్రార్థన’ అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..