Wedding Viral Video: పెళ్లిలో క్రేజీ సీన్.. అతిథుల మధ్య కొట్టాట.. సినిమా సీన్ మాదిరి ఎంజయ్ చేసిన వధూవరులు

వేదికమీద జయమాల వ్రతం జరుగుతోంది. ఈ సమయంలో, డ్రోన్ కెమెరా కూడా వధూవరుల ముందు ఉంది.. వేడుకను రికార్డ్ చేస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా వేదిక కింద కొంతమంది అతిథుల మధ్య వాగ్వాదం జరిగింది..

Wedding Viral Video: పెళ్లిలో క్రేజీ సీన్.. అతిథుల మధ్య కొట్టాట.. సినిమా సీన్ మాదిరి ఎంజయ్ చేసిన వధూవరులు
Bride Groom Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2022 | 8:37 PM

వివాహంలో అత్యంత ముఖ్యమైన ఆచారాలలో ఒకటి.. జయమాల వేడుక. వధూవరులు దండలు మార్చుకునే శుభ సమయంలో  అతిథులు పూర్తిగా వేదికను చుట్టుముట్టారు. ఈ వేడుకను కొందరు తమ మొబైల్ కెమెరాలో షూట్ చేయడానికి రెడీ అయ్యారు.. మరికొందరు వధూవరులను చూసేందుకు.. వారిని ఆశీర్వదించేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ప్రస్తుతం పెళ్లిళ్లలో రకరకాల పూల దండలు కనిపిస్తున్నాయి. కొన్ని సార్లు..  జయమాల సమయంలో వధువు డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది. మరికొన్ని పెళ్లి వేడుకల్లో వరుడు వధువుకి ప్రపోజ్ చేసి ఆశ్చర్యపరుస్తాడు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఓ వివాహ వేడుకలో భిన్నమైన సందర్భం కనిపించింది. పెళ్లి సమయంలో.. జయమాల వేడుక జరుగుతున్నప్పుడు.. వేదిక క్రింద ఉన్న కొంతమంది అతిథులు ఒకరితో ఒకరు గొడవపడ్డారు. ఈ వివాదం తీవ్రస్థాయికి చేరడంతో జయమాల వేడుకను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

జయమాల సందర్భంగా అతిథుల మధ్య గొడవ:

ఇవి కూడా చదవండి

పెళ్లిలో ప్రధాన ఘట్టమైన జయమాల కోసం తిరిగే వేదికను ఏర్పాటు చేశారు. ఆ వేదికపై వధూవరులు నిలబడి ఉండగా, వధువు చేతిలో హారతి పళ్లెంతో నిలబడి ఉంది. వేదికమీద జయమాల వ్రతం జరుగుతోంది. ఈ సమయంలో, డ్రోన్ కెమెరా కూడా వధూవరుల ముందు ఉంది.. వేడుకను రికార్డ్ చేస్తోంది. అప్పుడు అకస్మాత్తుగా వేదిక కింద కొంతమంది అతిథుల మధ్య వాగ్వాదం జరిగింది.. గొడవ ప్రారంభమైంది. వివాదం మరింత తీవ్ర తరం అయ్యి.. క్రింద ఉన్న అతిథులు ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. మొదట ఒకరిద్దరు మధ్య గొడవ జరిగి క్రమేణా విషయం పెరిగిపోయి ఒకరిపై ఒకరు కుర్చీలు వేసుకోవడం మొదలుపెట్టారు.

  అతిథుల మధ్య గొడవ

View this post on Instagram

A post shared by Rk Raj (@rajuraj2794)

పెళ్లిలో అతిథులు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం ప్రారంభించారు

పెళ్లి స్టేజ్‌పై నిలబడిన వరుడి దృష్టి  వధువు ఇస్తున్న హారతి మీద నుంచి గొడవవైపుకి మళ్లింది. గొడవను చూడటం మొదలుపెట్టాడు. వరుడు వెనుక వధువు హారతి పళ్లెం పట్టుకుని గొడవను చూస్తూ ఉంది. వేదిక దగ్గరగా ఉన్న ఓ అమ్మాయి వరుడి చేయి పట్టుకుని దృష్టిని మరల్చే  ప్రయత్నం చేసింది. వాగ్వాదం పెరిగి చాలా సేపు కొట్టుకుంటూనే ఉన్నారు. కొందరికి దెబ్బలు తగిలి పెళ్లి వేదిక నుంచి బయటకు వెళ్లడం మొదలుపెట్టారు..అయినప్పటికీ జనాల ఆకర్షణ మాత్రం అంతా ఆ గొడవ వైపు మాత్రమే ఉంది. కొన్ని సెకన్ల ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్‌గా మారింది.

ఈ వీడియో  rajuraj2794 అనే ఖాతా ద్వారా Instagram లో షేర్ చేశారు. ఇప్పటివరకు సుమారు 80 వేల మంది ఈ వీడియోను లైక్ చేసారు. కాగా ఈ వీడియోపై చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు. వధువు హారతి ఇచ్చే కార్యక్రమం ఏమైనా పర్వాలేదు అన్నట్లు ‘గా డ్రోన్ తో ఫైట్‌ను గొప్పగా కవరేజ్ చేశారని ఫన్నీ కామెంట్స్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!