Telugu News Trending Riflebird mating dance people will love bird efforts video viral in social media
Viral Video: ప్రేమ కోసం ఏమైనా చెయ్యాలంతే.. ఆడ పక్షిని ప్రసన్నం చేసుకోడానికి మగ పక్షినానా అగచాట్లు.. ప్రకృతిలో అందం అంటే ఇదే..
ఈ వీడియోలో కనిపిస్తున్న పక్షులు మన దేశంలో కనిపించవు. ఎందుకంటే అవి ఆస్ట్రేలియా ఇంకా వెస్ట్రన్ న్యూ గినియాలో కనిపించే రైఫిల్ పక్షులు. ఇక ఈ పక్షి రెక్కలు పైకెత్తి దాని పార్ట్‌నర్‌ముందు చేసిన డాన్స్‌ను మేటింగ్ డ్యాన్స్ అంటారట.
ప్రేమలో ఉన్న యువకుడు తన ప్రియురాలిని ప్రసన్నం చేసుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. చివరికి తన ప్రేమను సాధించుకోడానికి ఏం చేయడానికైనా సిద్ధపడతాడు. ఇది కేవలం మనుషులకే కాదండోయ్… పక్షులకు కూడా వర్తిస్తుందని నిరూపిస్తుంది ఈ వీడియో. ఈ వీడియోలో ఓ పక్షి తన పార్ట్‌నర్‌ను ప్రసన్నం చేసుకోడానికి ఏం చేసిందో చూడండి.. నెట్టింట ఓ రేంజ్లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక పక్షి తన భాగస్వామిని ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తోంది. అందుకు తన శరీరం పైభాగంలో రెక్కలను విప్పి అందమైన ఆకారంలో వచ్చి ఆడపక్షిముందు చిత్ర విచిత్రమైన విన్యాలు చేస్తుంది. అందుకు ఆ పక్షి తన మెడ చుట్టూ తన రెక్కలను విచిత్రంగా విప్పి తన భాగస్వామి ఉన్న కొమ్మమీద వాలి అటు ఇటూ గెంతుతూ రకరకాల విన్యాసాలు చేసింది. కానీ నీ ఆటలు నాదగ్గర చెల్లవులే అన్నట్టుగా ఆ ఆడ పక్షి మాత్రం తన పార్ట్‌నర్‌ని కనికరించినట్టులేదని వీడియో చూస్తే అర్ధమవుతుంది. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు.
— Morissa Schwartz (Dr. Rissy) (@MorissaSchwartz) December 9, 2022
ఈ వీడియోను మిలియన్ మందికిపైగా వీక్షించారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఈ వీడియోలో కనిపిస్తున్న పక్షులు మన దేశంలో కనిపించవు. ఎందుకంటే అవి ఆస్ట్రేలియా ఇంకా వెస్ట్రన్ న్యూ గినియాలో కనిపించే రైఫిల్ పక్షులు. ఇక ఈ పక్షి రెక్కలు పైకెత్తి దాని పార్ట్‌నర్‌ముందు చేసిన డాన్స్‌ను మేటింగ్ డ్యాన్స్ అంటారట. ఏది ఏమైనా వీడియో మాత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు.. ఆరే రామా.. మీకూ తప్పవా ఈ తిప్పలు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.