Viral Video: చీరలో ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసిన యువతి.. పెళ్ళిలో దేశీ యువతి సందడికి నెటిజన్లు ఫిదా

పెళ్లిలో డీజే పాటలు వినగానే మనసు పరవశిస్తుంది.. మనుషుల పాదాలు లయతో డ్యాన్స్ చేస్తాయి. నాన్-ప్రొఫెషనల్ డ్యాన్సర్లు కూడా పెళ్లిలో ప్లే అవుతున్న పాటలు విని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టి ప్రొఫెషనల్‌గా మారుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

Viral Video: చీరలో ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసిన యువతి.. పెళ్ళిలో దేశీ యువతి సందడికి నెటిజన్లు ఫిదా
Wedding Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2022 | 9:59 AM

పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం . ఇంటర్నెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒక వీడియో చర్చనీయాంశయమవుతూనే ఉంది. తాజాగా ఒక వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లను ఆకట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సప్నా చౌదరి ‘తేరీ ఆంఖ్య కా యో కాజల్’ పాటకు ఓ యువతి చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది. ఈ వీడియో ప్రజలను అలరిస్తోంది.

పెళ్లిలో డీజే పాటలు వినగానే మనసు పరవశిస్తుంది.. మనుషుల పాదాలు లయతో డ్యాన్స్ చేస్తాయి. నాన్-ప్రొఫెషనల్ డ్యాన్సర్లు కూడా పెళ్లిలో ప్లే అవుతున్న పాటలు విని డ్యాన్స్ చేయడం మొదలుపెట్టి ప్రొఫెషనల్‌గా మారుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా సప్నా చౌదరి పాట పెడితే స్త్రీ, పురుషులు కూడా ఓ రేంజ్ లో డ్యాన్స్ చేసి సందడి చేస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో స్వప్నా చౌదరి ‘తేరీ ఆంఖ్యా కా యో కాజల్’ పాటకు ఒక మహిళ డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఈ  క్లిప్‌ని ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఎందకంటే ఆ యువతి దేశీ సంప్రదాయాన్ని అనుసరిస్తూ చీర ధరించింది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లి సందడి కనిపిస్తోంది. పెళ్లి వేదిక వద్ద కొందరు తిండి తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు అటుఇటు తిరుగు హడావిడి పడుతున్నారు. అయితే వీరందరి మధ్యలో ఓ యువతి వచ్చి ‘తేరీ ఆంఖ్య కా యో కాజల్’ పాటకు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఆ యువతి ఉత్సాహంతో నృత్యం చేస్తున్న తీరుని అక్కడ ఉన్నవారు ఆస్వాదించారు. యువతి  నృత్యం చేసేటప్పుడు.. తన చుట్టూ పెద్దలున్నారని, తన డ్యాన్స్ ను చూస్తున్నారని కూడా మరచిపోయింది.

ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో kat_శ్రద్ధ అనే ఖాతా లో షేర్ చేశారు. 1.72 లక్షల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. ఒకరు సప్నా చౌదరి డ్యాన్స్ కూడా ఈ యువతి డ్యాన్స్ ముందు విఫలం అని ఒకరు అంటే.. ‘సంగీతం తనను తాను మరచిపోఎందుకు ఒక మార్గం అని ఎవరో సరిగ్గా చెప్పారు’ అని రాశారు. ఇది కాకుండా, చాలా మంది దీనిపై వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..