Funny Video: ఎవరేమి అనుకుంటే నాకేంటి.. నేను ఇంతే అన్నట్లు మెట్రోల్ టవల్, షర్ట్ తో ప్రయాణిస్తున్న యువకుడు.. నీ కాన్ఫిడెంట్ వేరే లెవల్ బ్రదర్..

Surya Kala

Surya Kala |

Updated on: Dec 09, 2022 | 1:29 PM

వైరల్ అవుతున్న వీడియోలో, మెట్రో రైలు లోపల అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మీరు చూడవచ్చు. ఇంతలో ఒక యువకుడు షర్ట్ ధరించి, టవల్ చుట్టుకొని మెట్రోలోకి ప్రవేశించాడు.

Funny Video: ఎవరేమి అనుకుంటే నాకేంటి.. నేను ఇంతే అన్నట్లు మెట్రోల్ టవల్, షర్ట్ తో ప్రయాణిస్తున్న యువకుడు.. నీ కాన్ఫిడెంట్ వేరే లెవల్ బ్రదర్..
Metro Video Viral

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెల్ఫీలు, రీల్స్ షేర్ చేసి.. లైక్స్ కోసం యువతీయువకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెటిజన్లను ఆకట్టుకోవానికి భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఒకొక్కసారి వీరి వింత పాట్లు చూస్తే ఓ వైపు నవ్వు వస్తుంది.. మరోవైపు అయ్యో పాపం అనే జాలి కలుగుతుంది. మరికొన్ని సార్లు షాక్ కలిగే విధంగా ఉంటాయి.  ఎందుకంటే ప్రపంచం చాలా విశిష్టమైనది .. చాలా భిన్నమైనది కనుక సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు.   కొన్నిసార్లు ఎవరైనా ఆశ్చర్యపోతారు.. మరికొన్ని సార్లు నవ్వు ఆపుకోలేక పడి పడి నవ్వుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఇది చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా నవ్వి నవ్వి పొట్టపట్టుకుంటారు.

ప్రస్తుతం ‘ఇన్‌స్టాగ్రామ్ రీల్స్’ క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది.. ఈ రీల్స్ కోసం వయసుతో పని లేకుండా దేనికైనా సిద్ధంగా అంటున్నారు కొందరు. యువతలోని రీల్స్ గురించి మాట్లాడుకోవాలంటే.. తమ సెల్ లోని కెమెరాకు పని చెప్పి.. ఎప్పుడైనా ఎక్కడైనా డ్యాన్స్ చేయడం ప్రారంభించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మాల్‌లో డ్యాన్స్  చేస్తూ సందడి,  రద్దీగా ఉండే రహదారిపై కొందరు రకరకాల విన్యాసాలు చేసిన రీల్స్ చూస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియో  చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఓ యువకుడు చొక్కా ధరించి, టవల్ చుట్టుకుని ఎటువంటి సిగ్గు లేకుండా మెట్రో రైల్ లో ప్రయాణిస్తున్నాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ లో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో, మెట్రో రైలు లోపల అబ్బాయిలు, అమ్మాయిలు అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మీరు చూడవచ్చు. ఇంతలో ఒక యువకుడు షర్ట్ ధరించి, టవల్ చుట్టుకొని మెట్రోలోకి ప్రవేశించాడు. అతని డ్రెసింగ్ ను చూసిన ప్రయాణీకులు షాక్ తిన్నారు. అయినా అబ్బాయి ఎవరి ఫీలింగ్స్ ను పట్టించుకోలేదు. ఎవరు ఏమి అనుకుంటే నాకేంటి.. నేను ఇంతే అన్నట్లుగా మెట్రోల్ లో ప్రయాణిస్తున్నాడు. ఈ వీడియో చూసిన వారు ఆ యువకుడి కాన్ఫిడెన్స్ చూసి.. మనిషి జీవితంలో ఇంత నమ్మకం ఉంటేనే అద్భుతాలు చేస్తాడు అని అంటున్నారు.

ఈ ఫన్నీ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో మోహిత్‌గౌహర్ అనే వినియోగదారుడు షేర్ చేశాడు. ‘ట్యాంక్‌లోని నీరు అయిపోయింది.. ఈ రోజు నేను ఆఫీసులోనే స్నానం చేస్తాను’ అని క్యాప్షన్ ఈ వీడియోకి జత చేశారు. 1.44 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు.  ఇలాంటి పని చేయడానికి చాలా ధైర్యం కావాలి’ అని ఒకరు కామెంట్ చేయగా.. మీ మనసుకు ఏది అనిపిస్తే అది చేయండి.. ప్రపంచం ఏమి అనుకుంటుంది.. ఏమి చేస్తుంది అనే పనిలేదు అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇంకొకరు.. ‘ఈ సోదరుడు నిజంగా తదుపరి స్థాయి’ అని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu