Trending News: సైనికుడి ఇంటి ముందు ఆగివున్న ఆర్మీ ట్యాంకర్‌.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

విషయం తెలిసిన స్థానికులు తండోపా తండాలుగా తరలివచ్చి ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటి..? అతడు యుద్ధ ట్యాంకర్‌ని ఎందుకు తన ఇంటిముందు పెట్టుకున్నాడు..

Trending News: సైనికుడి ఇంటి ముందు ఆగివున్న ఆర్మీ ట్యాంకర్‌.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Army Tank
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 12, 2022 | 7:19 PM

ఓ సైనికుడి ఇంటి ముందు కనిపించిన ఆసక్తికర దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆ వీడియోలో అతని ఇంటి ముందు ఒక పెద్ద యుద్ధ ట్యాంక్‌ ఆగివున్నట్టుగా కనిపిస్తుంది. ఎంత సైనికుడు అయితే మాత్రం యుద్ధ ట్యాంకర్‌ని ఏకంగా ఇంటికే తెచ్చుకున్నాడా..? అంటూ నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. విషయం తెలిసిన స్థానికులు తండోపా తండాలుగా తరలివచ్చి ఆ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటి..? అతడు యుద్ధ ట్యాంకర్‌ని ఎందుకు తన ఇంటిముందు పెట్టుకున్నాడు అన్న విషయానికి వస్తే..

కేరళ రాష్ట్రం కొల్లంకు చెందిన ఓ ఆర్మీ అధికారి ఇంటి ముందు కనిపించిన యుద్ధ ట్యాంక్‌ సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కరిప్రాకు చెందిన సైనికుడు ప్రవీణ్ ఇంటి ముందు యుద్ధ ట్యాంకర్‌ ప్రత్యక్షమైంది. అయితే, దూరం చూస్తే అది యుద్ధంలో శత్రువులను నాశనం చేసే యుద్ధ ట్యాంకర్‌ అనిపిస్తుంది. కానీ, తీరా దగ్గరి వచ్చి చూస్తే మాత్రం అందరూ అవాక్కవ్వాల్సిందే..ఎందుకుంటే, అది బాంబులు వేసే యుద్ధ ట్యాంకర్‌ కాదు. చల్లటి నీటిని పంచే బావి. అతని ఇంటి ముందున్న బావి ఆర్మీ ట్యాంక్‌ తరహాలో నిర్మించబడింది. సైనికుడి ఇంటికి అనువైన నిర్మాణం ఉండాలనే ఆలోచనతోనే ఇలాంటి నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఇరవై ఏడు నమూనాలను పరిశీలించిన తర్వాత ఇటువంటి బావి నిర్మాణం మొదలుపెట్టారట. ఇక ఆ ఇంటి పేరు కాశ్మీర్.

అయితే, ఈ యుద్ధ ట్యాంకర్‌ బావి నిర్మాణం వెనుక ప్రవీణ్‌ కొడుకు కోరిక కూడా ఉందట. ఆర్మీ ట్యాంక్‌ వంటి బొమ్మలను ఇష్టపడే ప్రవీణ్‌ కొడుకు కోరిక మేరకు ఇలాంటి ఇంటి నిర్మాణం చేస్తున్నట్టుగా చెప్పారు. తిరువనంతపురంలో ప్రదర్శించిన పాత ట్యాంక్ మోడల్ కొలతల ఆధారంగా ఈ ‘బావి’ ట్యాంక్‌ను సిమెంట్‌తో తయారు చేశారట. మొత్తానికి ఈ ఇంటి నిర్మాణం మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఫోటోలు చూసిన నెటిజన్లు సదరు సైనికుడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి