Trending Video: ఏటీఎంలో ప్రత్యక్షమైన జింక.. ఎందుకో తెలిస్తే మీరు కూడా జాలిపడతారు..

లోపలికి అయితే, దూరింది కానీ, బయటకు వెళ్లే మార్గం లేక బిక్కుబిక్కు మంటూ కనిపించింది. పాపం నోరులేని మూగజీవి అద్దాల నిర్మాణంలో బిక్కముఖం పెట్టుకుని చూస్తోంది.

Trending Video: ఏటీఎంలో ప్రత్యక్షమైన జింక.. ఎందుకో తెలిస్తే మీరు కూడా జాలిపడతారు..
Deer Inside Atm
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 12, 2022 | 6:46 PM

తరచూ అడవి జంతువులు దారితప్పి జనావాసాల్లోకి వస్తుంటాయి. ఈ క్రమంలోనే పలు రకాల జంతువులు ప్రమాదాల బారినతుంటాయి. కొన్ని సందర్భాల్లో మనుషులు వాటికి హాని కలిగిస్తే, మరికొన్ని సందర్బాల్లో వీధికుక్కలు అటవీ జంతువులను వెంబడించిన ఘటనలు మనం చూస్తుంటాం. అలా కుక్కల బారిన పడి చాలాసార్లు నెమళ్లు, జింకలు వంటివి ఎక్కువగా గాయపడిన ఘటనలు మనం చూస్తుంటాం. అయితే, తాజాగా జింక కూడా అడవి నుంచి తప్పిపోయి ఏటీఎంలో దూరింది. లోపలికి అయితే, దూరింది కానీ, బయటకు వెళ్లే మార్గం లేక బిక్కుబిక్కు మంటూ కనిపించింది. పాపం నోరులేని మూగజీవి అద్దాల నిర్మాణంలో బిక్కముఖం పెట్టుకుని చూస్తోంది. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది. ఓ జింక ఏటీఎంలో చిక్కుకున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

గుజరాత్‌లోని అమ్రేలి ప్రాంతం ధారిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్నట్టుగా తెలిసింది. ఈ మేరకు స్ధానికులు వీడియో రికార్డు చేశారు. కుక్క‌ల గుంపు వెంట‌ప‌డ‌టంతో వాటి నుంచి త‌ప్పించుకునే క్ర‌మంలో జింక ఏటీఎంలో చిక్కుకుపోయింది. ఏటీఎం నుంచి బ‌య‌ట‌ప‌డే దారిలేక ఆందోళ‌న‌తో జింక గంతులేస్తుండ‌గా స్ధానికుల కంట‌ప‌డింది. వారు రెస్క్యూ టీంకు స‌మాచారం అందించారు. స‌హాయ సిబ్బంది ఏటీఎం వ‌ద్ద‌కు చేరుకుని జింక‌ను సురక్షితంగా బ‌య‌ట‌కు తీసుకువచ్చారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి