AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువకుడు..! అదిరిపోయే డ్యాన్స్‌తో అందిరినీ బెదరగొట్టేశాడు..

ఇక వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఒక్కో వినియోగదారు ఒక్కో విధంగా ఉల్లాసకరమైన వ్యాఖ్యలను పోస్ట్‌ చేస్తున్నారు.

Viral Video: రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌లో రెచ్చిపోయిన యువకుడు..! అదిరిపోయే డ్యాన్స్‌తో అందిరినీ బెదరగొట్టేశాడు..
Boy Dancing Video
Jyothi Gadda
|

Updated on: Dec 12, 2022 | 4:00 PM

Share

ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఇతర అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రజలు షేర్ చేసే వీడియోలతో ఇంటర్నెట్ నిండి పోతుంది. ఇకపోతే, డ్యాన్స్ వీడియోలు ఇంటర్నెట్‌లో బాగా వైరల్ అవుతుంటాయి.. అత్యధికంగా వీక్షించబడిన వీడియోలలో ఒకటి ఇటీవల, ఒక వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేసింది. ఈ వీడియోలో పెళ్లికి వచ్చిన అతిథులు పాత్రలతో డ్యాన్స్ చేస్తున్నారు. చాలా మంది వీక్షకులు వీడియోపై తీవ్రంగా స్పందించారు. . ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ఇలాంటి వీడియో బాగా వైరల్‌ అవుతోంది. రైల్వే స్టేషన్‌లో యువకుడు చేసిన హంగామాకు నెటిజన్ల నుండి విశేషమైన స్పందన వస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియో డిసెంబరు 2న అప్‌లోడ్ చేయబడింది. కాగా, అప్‌లోడ్‌ చేసిన కొద్ది రోజులకే ఈ డ్యాన్స్ వీడియోకి లక్షల సంఖ్యలో వ్యూస్‌, లైక్‌లు వస్తున్నాయి.

కృష్ణ రాథోడ్ అని పిలవబడే డ్యాన్సర్‌, కదులుతున్న రైల్లోంచి దిగుతున్నట్టుగా వీడియోలో కనిపిస్తుంది. అతడు రైలు దిగిన వెంటనే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై రెచ్చిపోయి డ్యాన్స్‌ చేయడం ప్రారంభించాడు. ఆ దృశ్యం రైల్వే స్టేషన్ వేదికగా మారుతుంది. యువకుడు డ్యాన్స్‌ చేస్తూనే ప్లాట్‌ఫారమ్‌ నుంచి మైదాన ప్రదేశానికి వెళ్తాడు. ఈ క్రమంలోనే ఈ వీడియో షూటింగ్ జరిగిన ప్రదేశం నల్ల సోపారా-ని రైల్వే స్టేషన్‌గా మనకు బోర్డుపై కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక వైరల్‌ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఒక్కో వినియోగదారు ఒక్కో విధంగా ఉల్లాసకరమైన వ్యాఖ్యలను పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్‌ అవుతున్న ఈ వీడియోకి 46,000 లైక్‌లు,11 లక్షలకు పైగా వీడియో వ్యూస్ వచ్చాయి.

మరిన్ని వైరల్ వీడియోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి