AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: పంజాబ్‌లో తాలిబన్ల శిక్ష.. యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి ఊరేగించిన డ్రైవర్

పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో ఓ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి నగరమంతా ఊరేగించారు. కదులుతున్న ట్రక్కు నుంచి రెండు గోధుమల బస్తాలను దొంగిలించడమే ఆ యువకుడు చేసిన పాపం. దీనికి శిక్షగా ఆ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టి నగరమంతా ఊరేగించారు

Shocking Video: పంజాబ్‌లో తాలిబన్ల శిక్ష.. యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి ఊరేగించిన డ్రైవర్
Thief
Basha Shek
|

Updated on: Dec 12, 2022 | 6:05 PM

Share

పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో ఓ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి నగరమంతా ఊరేగించారు. కదులుతున్న ట్రక్కు నుంచి రెండు గోధుమల బస్తాలను దొంగిలించడమే ఆ యువకుడు చేసిన పాపం. దీనికి శిక్షగా ఆ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టి నగరమంతా ఊరేగించారు. ఆపై పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది . ఈ వీడియోలో ట్రక్ డ్రైవర్, హెల్పర్‌ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతుండడం చూడవచ్చు. ఈ అమానవీయ సంఘటన ఆదివారం సాయంత్రం అబోహర్ రోడ్డులో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. యువకుడు కదులుతున్న ట్రక్కు నుండి గోధుమ బస్తాలను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. అయితే ట్రక్ డ్రైవర్ అతడిని పోలీసులకు అప్పగించకుండా ముందుగా ట్రక్కు బానెట్‌కు కట్టేసి ఊరంతా ఊరేగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

తాలిబన్ల శిక్షలా?

వైరలవుతోన్న ఈ వీడియోలో యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి ఉండగా, డ్రైవర్ సహాయకుడు అతడిని పట్టుకున్నట్లు వైరల్ క్లిప్‌లో చూడవచ్చు. అలాగే యువకుడు రెండు గోధుమల బస్తాలను దొంగిలించాడని, అందుకే అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు హెల్పర్ చెప్పడం వినవచ్చు. వైరల్ వీడియో ఆధారంగా ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని పంజాబ్ పోలీస్ డీఎస్పీ జగదీష్ కుమార్ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ‘పంజాబ్‌లో తాలిబాన్లు ఉన్నారా? ఏంటి? ఇంత దారుణంగా శిక్షలు వేస్తున్నారు’ అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?