Viral Video: మరో మట్టిలో మాణిక్యం.. లతాజీ పాటను హృద్యంగా ఆలపిస్తున్న మహిళ.. మ్యూజిక్ లవర్స్ కు ఒక ట్రీట్
సోషల్ మీడియా కొందరిని రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చేసింది. ఈ క్రమంలో మరో మట్టిలో మాణిక్యం వెలుగులోకి వచ్చింది. మహాబలేశ్వర్ వీధుల్లో లతా మంగేష్కర్ సూపర్ హిట్ సాంగ్ సునో సజ్నా పాపిహే నే పాట పాడుతున్న ఒక మహిళ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
ఈ దేశంలో ప్రతిభకు కొరత లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా మంచి వేదిక అయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియా కొందరిని రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చేసింది. ఈ క్రమంలో మరో మట్టిలో మాణిక్యం వెలుగులోకి వచ్చింది. మహాబలేశ్వర్ వీధుల్లో లతా మంగేష్కర్ సూపర్ హిట్ సాంగ్ సునో సజ్నా పాపిహే నే పాట పాడుతున్న ఒక మహిళ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సంగీత ప్రియులకు ఒక ట్రీట్ గా మారింది. ఈ మహిళ పాటను ఎంతో హృద్యంగా పాడుతూ నెటిజన్లు ఆకట్టుకుంటోంది.
1966లో విడుదలైన ఆయే దిన్ బహర్ కే మూవీ నుంచి లతాజీ పాడిన పాటను తనదైన శైలిలో ఆలపిస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఆమె గొంతులో ఈ పాట మరింత శ్రావ్యంగా ఉందని మహిళ టాలెంట్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ వైరల్ వీడియోను సయ్యద్ సల్మాన్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు.
View this post on Instagram
మహాబలేశ్వర్‌లోని పంచ్‌గని సమీపంలోని పార్శీ పాయింట్ వద్ద ఆ మహిళ ఈ పాట పాడారు. ఈ వీడియోను 6 లక్షల మందికి పైగా వీక్షించారు. మహిళ మధుర గళాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..