Little Girl Viral Video: ఒకేసారి రెండు చేతులతో చకచకా రాస్తున్న చిన్నారి.. నీ ప్రతిభకు మేము సలామ్ అంటోన్న నెటిజన్లు..

ఇలాంటి చిన్నారిని చూసి ఉండడం మాత్రం బహు అరుదు. వైరల్ క్లిప్‌లో.. బాలిక రెండు చేతులతో ఒకేసారి రాయడం చూడవచ్చు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు నన్ను నమ్మండి.

Little Girl Viral Video: ఒకేసారి రెండు చేతులతో చకచకా రాస్తున్న చిన్నారి.. నీ ప్రతిభకు మేము సలామ్ అంటోన్న నెటిజన్లు..
Little Girl Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2022 | 7:58 PM

ప్రపంచంలో ప్రతిభావంతులైన వారికీ కొదవు లేదు.. వాస్తవానికి టాలెంట్ కు వయసుకి సంబంధం లేదు. అందుకు ఉదాహరణగా పిల్లల వీడియాలను చూపించవచ్చు. పెద్దలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రతిభావంతులైన పిల్లల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.. కొన్ని వీడియోల మీద నుంచి మనం కళ్లు తిప్పుకోలేము.. వాటినే చూస్తూ ఉండిపోతాం.. తాజాగా ఒక చిన్నారి వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. అందులో బాలిక తన నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. సర్వ సాధారణంగా ఎవరైనా ఎడమ లేదా కుడి చేతితో మాత్రమే వ్రాస్తారు. లేదా రెండు చేతులతోనూ రాసే వ్యక్తులు ఉంటారు. కానీ ఒకొక్కసారి ఒకొక్క చేతిని రాయడానికి ఉపయోగిస్తారు. అంతేకానీ.. ఇలాంటి చిన్నారిని చూసి ఉండడం మాత్రం బహు అరుదు. వైరల్ క్లిప్‌లో.. బాలిక రెండు చేతులతో ఒకేసారి రాయడం చూడవచ్చు. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు నన్ను నమ్మండి.

ప్రతి ఒక్కరికి వారి స్వంత రచనా శైలి ఉంటుంది. కొందరు కుడిచేత్తో రాస్తే, మరికొందరు ఎడమచేతితో రాస్తారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో.. అమ్మాయి రెండు చేతులతో ఒకేసారి రాయడం మీరు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ అమ్మాయి రెండు చేతులతో చాలా వేగంగా రాస్తోంది. ఆడపిల్ల ప్రతిభ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఇంత చిన్న వయసులో పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేని పిల్లలు కూడా ఉంటారు. అయితే ఈ లిటిల్ గర్ల్.. మాత్రం హాయిగా రెండు చేతుల్లో రెండు పెన్సిల్స్ ను పట్టుకుని చకచకా రాసేస్తోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Earthdixe (@earthdixe)

చిన్నారి రాత వేగాన్ని చూసి మీ మనసు కూడా ఒక్క క్షణం అయోమయం చెందుతుంది అంటే నమ్మండి. Earthdixe అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నవంబర్ 27న షేర్ చేయబడిన ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది లైక్ చేశారు. ఒకరు, ‘అద్భుతం, నేను ఈ అమ్మాయి వలె తెలివైనవాడిగా ఉండాలనుకుంటున్నాను అని అంటే.. మరొకరు వావ్… ఈ అమ్మాయి నిజంగా అద్భుతం చేస్తోంది.. అని అంటున్నారు. ఈ బాలిక చైనీస్ అమ్మాయి అని నేను ఖచ్చితంగా చెప్పగలను అని కామెంట్ చేశారు. మొత్తానికి ఈ చిన్నారి తన ప్రతిభతో నెటిజన్ల హృదయాన్ని గెలుచుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..