AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IAS Success Story: రైల్వే స్టేషన్ లో ‘ప్రీ వైఫై’ సాయంతో చదువుకుని కూలీ నుంచి ఐఏఎస్‌గా.. వావ్ వాటే జర్నీ

కొందరు ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా.. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. చరిత్రతో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. ఈరోజు రైల్వే స్టేషన్ లో ప్రీ వై ఫై సహాయంతో కేరళ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన స్ఫూర్తివంతమైన ఓ యువకుడిగురించి తెలుసుకుందాం.

IAS Success Story: రైల్వే స్టేషన్ లో 'ప్రీ వైఫై' సాయంతో చదువుకుని కూలీ నుంచి ఐఏఎస్‌గా.. వావ్ వాటే జర్నీ
Ias Success Story
Surya Kala
|

Updated on: Dec 14, 2022 | 3:04 PM

Share

కొంతమంది ఎప్పుడూ అది లేదు.. ఇది లేదంటూ అంటూ నిరాశావాదంతో నిత్య అసంతృప్తితో తమ జీవితాన్ని గడిపేస్తారు. మరికొందరు బతకడం కోసం.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలను అన్వేషిస్తాడు. అందుకు అనుగుణంగా తనకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుని కష్టాలకు, నష్టాలకు వెరవకుండా ప్రయత్నం చేస్తాడు. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. చరిత్రతో తమకంటూ ఓ పేజీని లిఖించుకుంటారు. ఈరోజు రైల్వే స్టేషన్ లో ప్రీ వై ఫై సహాయంతో కేరళ పబ్లిక్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన స్ఫూర్తివంతమైన ఓ యువకుడిగురించి తెలుసుకుందాం.. వివరాల్లోకి వెళ్తే..

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌లోకి వెళ్లే మార్గం చాలా కఠినమైనది. అయితే కేరళకు చెందిన ఓ రైల్వే కూలీ కేరళ పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి IAS లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. రైల్వే కూలీ శ్రీనాథ్ కె..  రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న ఉచిత వై-ఫై సహాయంతో KPSC KAS పరీక్షలో విజయాన్ని సొంతం చేసుకున్నారు. కూలీ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా అతని ప్రయాణం ఎలా సాగిందంటే..

ఇవి కూడా చదవండి

మున్నార్ యాడ్‌కు చెందిన శ్రీనాథ్ ..  కొచ్చిన్ రైల్వే స్టేషన్‌లో కూలీగా పని చేశారు. అయితే..తన కుటుంబానికి మెరుగైన జీవితం ఇవ్వాలంటే.. తాను ఇప్పుడు సంపాదిస్తున్న సంపాదన సరిపోదని భావించారు. మంచి జీతం కలవాలంటే.. ప్రభుత్వం ఉద్యోగం సంపాదించాలని ఆలోచించిన శ్రీనాథ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.

అయితే నిర్ణయం అయితే తీసుకున్నారు.. కానీ ఓ వైపు కూలీగా పనిచేయాల్సి ఉండడంతో.. పని సమయాలు, భారం ఇవన్నీ కలిపి శ్రీనాథ్ కు చదువుకోవడానికి సమయం సరిపోయేది కాదు. ఈ నేపథ్యంలో 2016లో..  రైల్‌టెల్, గూగుల్ భారతదేశంలోని అనేక రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fiని అందించాయి. ఇలా రైల్వే స్టేషన్ లో ఉచిత Wi-Fi ప్రారంభించిన తర్వాత..  శ్రీనాథ్ పని చేస్తూనే చదువుకోవడంపై మరింత దృష్టి పెట్టాడు. ఆడియోబుక్స్ , వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేవారు.. ఓ వైపు పనిచేస్తూనే.. డౌన్ లోడ్ చేసిన పుస్తకాలను వింటూ..  KPSC పరీక్షకు సిద్ధమవడం ప్రారంభించారు.

కోచింగ్, అదనపు తరగతులకు ఖర్చు చేసే అనేక మంది అభ్యర్థులకు విరుద్ధంగా.. శ్రీనాథ్ తన డబ్బును మెమరీ కార్డ్, ఫోన్, ఒక జత ఇయర్‌ఫోన్‌ల కోసం ఖర్చు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమైన తర్వాత.. విలేజ్ అసిస్టెంట్ పోస్టు కోసం కేరళ పబ్లిక్ సర్వీస్ పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 82 శాతం స్కోర్‌తో ఉత్తీర్ణత సాధించారు. 2018లో శ్రీనాథ్ సాధించిన విజయాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గూగుల్ ఇండియా ద్వారా పంచుకున్నారు. అప్పుడు శ్రీనాథ్ కృషి, పట్టుదల పై సర్వత్రా ప్రశంసలను అందుకున్నారు.

శ్రీనాథ్ UPSC సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యారు. UPSC CSEలో  4వ ప్రయత్నంలో IAS అధికారిగా ఉత్తీర్ణత సాధించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ యువకుడు గురించి సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..