Campus placements: వరంగల్ నిట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. రూ. 88 లక్షల ప్యాకేజీతో దుమ్మురేపిన విద్యార్థి.
ఓవైపు ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నా.. ఉద్యోగుల తొలగింపు వార్తలు హల్చల్ చేస్తున్నా బడా కంపెనీలు మాత్రం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తగ్గడం లేదు. ట్యాలెంట్ ఉన్న విద్యార్థులకు ఎంతైన జీతం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశంలోని..
ఓవైపు ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నా.. ఉద్యోగుల తొలగింపు వార్తలు హల్చల్ చేస్తున్నా బడా కంపెనీలు మాత్రం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తగ్గడం లేదు. ట్యాలెంట్ ఉన్న విద్యార్థులకు ఎంతైన జీతం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దేశంలోని ఐఐటీల్లో భారీ ప్యాకేజీలకు విద్యార్థులను ఎంపిక చేసుకున్నాయి కంపెనీలు. ఈ నేపథ్యంలో తాజాగా వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులు సైతం సత్తా చాటారు. వరంగల్ నిట్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఆదిత్య సింగ్ రూ. 88 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికై సరికొత్త రికార్డు సృష్టించాడు. వరంగల్ ఎన్‌ఐటీ చరిత్రలోనే ఇంతటి ప్యాకేజీ అందుకున్న తొలి విద్యార్థిగా రికార్డు సృష్టించాడు.
అంతేకాకుండా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాజలీని దాటేసి మరీ అధికా ప్యాకేజీని సొంతం చేసుకున్నాడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో చదువుతున్న ఓ ఎంటెక్ విద్యార్థి ఇటీవల రూ. 63.8 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. ఈ సీజన్‌లో ఇదే అత్యధికంగా కాగా వరంగల్ నిట్‌కి చెందిన ఆదిత్య ఈ రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది వరంగల్ నిట్‌లో ఓ విద్యార్థి రూ. 62.5 లక్షల ప్యాకేజీ తీసుకోగా ఇప్పుడు ఆ రికార్డు సైతం తిరగరాశాడు ఆదిత్య సింగ్. ఇదిలా ఉంటే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వరంగల్ నిట్‌లో 724 మంది బీటెక్ విద్యార్థులు ఉన్నాయి. సీఎస్‌ఈకి చెందిన విద్యార్థుల సగటు ప్యాకేజీ గతేడాది రూ. 25.5 లక్షలు ఉండగా, ఈ ఏడాది 3.19 లక్షలకు పెరిగింది.
వరంగల్ నిట్‌లో జరుగుతోన్న క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించి డైరెక్టర్ ఎన్‌వి రమణ రావు మాట్లాడుతూ.. ‘కంపెనీలు తమతో ఎక్కువ కాలం ఉండే అభ్యర్థుల కోసం వెతుకుతున్నాయి. మా విద్యార్థుల రిటెన్షన్ రేటు ఎక్కువగా ఉండటంతో ఐఐటీల కంటే మెరుగ్గా రాణించడానికి ఇది ఒక కారణమని భావిస్తున్నాం. ఈ సంవత్సరం ఐఐటీల కంటే చాలా ఎన్ఐటీలు చాలా మెరుగ్గా పనిచేశాయి. కొన్ని సంవత్సరాల క్రితం, మా అత్యధిక ప్యాకేజీ 55 లక్షలు. ఈ ఏడాది అది ఐఐటీ కంటే మెరుగ్గా ఉంది’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..