IIIT Recruitment: ట్రిపుల్ ఐటీలో టీచింగ్ పోస్టులు.. ఎలాంటి రా తపరీక్ష లేకుండానే ఎంపిక.
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ క్యాంపస్‌లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు విభాగాల్లో..
కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ క్యాంపస్‌లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, బేసిక్ సైన్సెస్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగాల్లో పని అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను డెమో క్లాస్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 30-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..