Eating with Hands: చేతులతో భోజనం చేయడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..
ఈ మధ్య కాలంలో ఆహారాన్ని స్పూన్లతో తినడం బాగా అలవాటైపోయింది. కానీ చేతి వేళ్లతో కలిపి తింటే ఉండే ఆనందమే వేరు. చేతులతో భోజనం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి చేతితో ఆహారం తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూసేయండి..
ప్రస్తుత కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి. లైఫ్ స్టైల్‌లో మార్పుల కారణంగా తినే విధానంలో లెక్కలేనన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. భోజనం చేయడానికి కూడా సమయం ఉండటం లేదు. ఇంతకు ముందు ఆహారం తినే సమయంలో ఎంతో ప్రశాంతంగా సమయం కేటాయించి కింద కూర్చుని, మాట్లాడుకుంటూ చేతితో తినేవారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఇవేమీ లేవు. డైనింగ్ టేబుల్స్ మీద కూర్చొని స్టైల్‌గా స్పూన్‌తో తింటున్నారు. కుదరని సమయంలో స్పూన్లతో తినవచ్చు. కానీ ఇంట్లో కూడా చాలా మంది స్పూన్లతోనే అన్నం తింటున్నారు. దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. చేతులో అన్నం తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయి. కానీ ఈ విషయాలు చాలా మందికి తెలీదు. మరి చేతులతో అన్నం తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గుతారు:
కింద కూర్చొని చేతితో అన్నం తినడం వల్ల త్వరగా కడుపు నిండుతుంది. దీంతో ఎక్కువగా తినలేరు. కాబట్టి పొట్టలోకి ఆహారం తక్కువగా వెళ్తుంది. ఈ క్రమంలో బరువు కూడా ఎక్కువగా పెరగకుడా ఉంటారు. అదే స్పూన్‌తో తింటే ఎంత తింటున్నారో కూడా తెలీదు.
జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:
చేతి వేళ్లతో అన్నం తినడం వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. ఎందుకంటే మీరు అన్నాన్ని చేతితో తినేముందు తాకడం వల్ల మెదడుకు సంకేతం వెళ్తుంది. ఇవి పొట్టలో ఎంజైమ్స్ ఉత్పత్తి చేస్తాయి. ఇవి జీర్ణ క్రయ మెరుగు పడేందుకు హెల్ప్ చేస్తాయి.
జీర్ణ సమస్యలు ఉండవు:
చేతితో భోజనం. చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణ వ్యవస్థకు చక్కగా పని చేస్తుంది. ఆహారాన్ని తాకినప్పుడు జీర్ణ వ్యవస్థ మరింత యాక్టీవ్ అవుతుంది. ఇంద్రియాలు, చేతులు కలిసి మనుకు నిండుగా అనిపించేలా చేస్తాయి. తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతుంది.
వ్యాయామంగా ఉంటుంది:
కింద కూర్చొని చేతితో భోజనం చేయడం వల్ల శరీరానికి కూడా వ్యాయమంగా ఉంటుంది. దీంతో శరీరం మొత్తం కూడా రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. క్యాలరీలు కూడా కరుగుతాయి.
రక్త ప్రసరణ జరుగుతుంది:
చేతులతో నేరుగా అన్నం కలిపి తినడం వల్ల చేతి వేళ్లకు చక్కగా రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. చేతి వేళ్లతో తిన్నప్పుడు మెదడుకు కూడా ఆనందంగా ఉంటుంది. దీంతో మెదడు కూడా యాక్టీవ్ అవుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగితే తిమ్మిర్లు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.