Liver Health: ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. లివర్ ఆరోగ్యంగా పని చేస్తేనే ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాం. లివర్‌లో ఎలాంటి సమస్యలు ఏర్పడినా.. చాలా కష్టం. ఇలాంటి ఫుడ్స్ మీరు తీసుకుంటే.. లివర్ ఎంతో ఆరోగ్యంగా పని చేస్తుంది. కాబట్టి మీ డైట్‌లో ఈ ఫుడ్స్ ఉన్నాయో లేవో చూసుకోండి..
శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో లివర్ కూడా ఒకటి. ఇవి ఆరోగ్యంగా ఉండి, పని చేస్తేనే శరీరంలో ఇతర భాగాలు కూడా ఆరోగ్యంగా పని చేస్తాయి. లివర్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చి ఆ ఎఫెక్ట్ జీర్ణాశయంపై పడుతుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలు రాక తప్పదు. కాబట్టి లివర్ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. కేవలం గుండె మాత్రమే ముఖ్యం కాదు.. లివర్ చక్కగా పని చేస్తేనే.. గుండె కూడా హెల్దీగా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు, మలినాలను బయటకు పంపించడంలో లివర్ ఎంతో ముఖ్యమైన పనులు చేస్తుంది. దాదాపు 500 రకాల పనులు చేస్తుంది లివర్. తిన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వాలాన్నా.. శరీరానికి శక్తి అందాలన్నా లివర్ సరిగా పని చేయాలి. ఇన్ని ముఖ్యమైన పనులు నిర్వర్తించే లివర్ ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మరి ఇలాంటి లివర్ ఆరోగ్యంగా పని చేయాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఈ ఆహారాలు వద్దు:
లివర్ చక్కగా ఆరోగ్యంగా పని చేయలంటే కేవలం ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. సోడాలు, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, జంక్ ఫుడ్స్, మసాల ఫుడ్స్ తీసుకోకూడదు. దీని వల్ల కాలేయంపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ ఆహారాన్ని క్లీన్ చేయడంలో లివర్‌కు చాలా సమయం పడుతుంది. కాబట్టి వీటిని అతిగా తినడం తగ్గించండి.
నేరేడు పండ్లు:
మనకు శీతా కాలంలో ఎక్కువగా ఈ నేరేడు పండ్లు లభిస్తాయి. పూర్వం ఏ సీజన్ అయితే ఆ సీజన్‌లో దొరికే ఫ్రూట్స్ తినేవారు. అందుకే అప్పటి వారు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఈ కాలంలో జంక్ ఫుడ్స్‌కి బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి మీకు నేరేగు పండ్లు దొరికితే ఖచ్చితీసుకోండి. ఇవి లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది.
దానిమ్మ కాయలు:
దానిమ్మ కాయలు తిన్నా, జ్యూస్ తాగినా లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ పండులో ఉండే పోషకాలు.. లివర్‌లో ఫ్యాట్ చేరకుండా చేస్తుంది. లివర్ డీటాక్స్ అవుతుంది. వ్యర్థాలు అన్నీ బయటకు పోతాయి.
కాకర కాయ:
చేదుగా ఉంటుంది చాలా మంది కాకర కాయను అస్సలు తినరు. కానీ కాకర కాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. కాలేయాన్ని కడిగినట్లుగా శుభ్రం చేస్తుంది. ఇందులో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడుతుంది. కాలేయ సమస్యలు రాకుండా చేస్తుంది.
పసుపు:
మన తీసుకునే అన్ని ఆహారాల్లో కూడా పసుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతే కాకుండా పసుపు నీళ్లు, పసుపు మిల్క్ వంటివి తాగుతూ ఉండటం వల్ల కూడా శరీరం డీటాక్స్ అవుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పసుపు హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా పర్వాల్ అనే సీజనల్ వెజిటేబుల్, మంచినీరు ఎక్కువగా తాగడం, గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్, సిట్రస్ ఫ్రూట్స్, గ్రీన్ టీ, వెల్లుల్లి, బ్రోకలీ వంటివి తిన్నా కాలేయం ఆరోగ్యంగా పని చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.