NASA: ఆ గ్రహాల నిండా నీళ్లే.. అంతరిక్షంలో మరో రెండు కొత్త గ్రహాలను కనుగొన్న నాసా..

మానవాళి మనుగడకు నీరు చాలా అవసరం. నీరు లేనిదే జీవం లేదు. నీటిని ఆధారంగా చేసుకుని జీవం పుట్టిందని పలు అధ్యయనాలు, శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. కాబట్టి నీటిని అన్వేషించాల్సిన..

NASA: ఆ గ్రహాల నిండా నీళ్లే.. అంతరిక్షంలో మరో రెండు కొత్త గ్రహాలను కనుగొన్న నాసా..
Space
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 18, 2022 | 1:53 PM

మానవాళి మనుగడకు నీరు చాలా అవసరం. నీరు లేనిదే జీవం లేదు. నీటిని ఆధారంగా చేసుకుని జీవం పుట్టిందని పలు అధ్యయనాలు, శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. కాబట్టి నీటిని అన్వేషించాల్సిన అవసరం మానవులకు ఏర్పడింది. భూమిపై ఉన్న నీటిలో నాలుగింట మూడొంతులకు పైగా ఉప్పు నీరు కావడం, అది వ్యవసాయ, తాగు నీటి అవసరాలు తీర్చలేకపోవడం వంటి కారణాలతో నీటికి ఇబ్బందులు ఏర్పడ్డాడు. మంచి నీటి కోసం అనేక పద్ధతులు పాటించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే ప్రస్తుతం భూమిపైనే కాదు.. ఇతర గ్రహాల మీద కూడా నీటి జాడ ఉందా లేదా అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సైంటిస్టులు అద్దిరిపోయే విషయాన్ని కనుగొన్నారు. ఆ విషయం తెలిసి వాళ్లే ఆశ్చర్యపోయారు. చూడాలి మరి.. భవిష్యత్ నీటి అవసరాలను ఆ గ్రహాలు తీరుస్తాయా.. లేక మానవ మనుగడ అక్కడ కొనసాగుతుందా అనేది.

నాసా మరో రెండు కొత్త గ్రహాలను కనుగొంది. ఆ గ్రహాలనిండా నీళ్లే ఉండటం విశేషం. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన హబుల్‌ టెలిస్కోప్‌ నీటి జాడలున్న ఈ కొత్త గ్రహాలను గుర్తించింది. ఈ మేరకు ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రెండు గ్రహాలు ఓ నక్షత్ర మండలంలో భాగంగా ఉన్నాయని, అంతేకాదు, అవి భూమి పరిమాణం కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా ఈ గ్రహాలు రెండూ ఎర్రగా ఉండే ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయని తెలిపారు.

లిరా నక్షత్ర మండలంలో 218 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కొత్త గ్రహాలు ఉన్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండు గ్రహాలు నీటితో నిండి ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి కెప్లెర్-138సి, కెప్లెర్-138డి అని నామకరణం చేశారు. అయితే ఈ రెండు గ్రహాలపైనా అత్యధిక భాగం నీరు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?