AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రఘునందన్.. అలా చేస్తారా అంటూ..

తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు రాజకీయ సవాళ్లకు దారితీస్తున్నాయి. ఈడీ నోటీసులు వచ్చిన రోహిత్‌రెడ్డి చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు.

Hyderabad: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రఘునందన్.. అలా చేస్తారా అంటూ..
Raghunandan Rao
Shiva Prajapati
|

Updated on: Dec 17, 2022 | 9:37 PM

Share

తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు రాజకీయ సవాళ్లకు దారితీస్తున్నాయి. ఈడీ నోటీసులు వచ్చిన రోహిత్‌రెడ్డి చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అక్కడి నుంచే బండి సంజయ్‌కు సవాళ్లు విసిరారు. తనకు డ్రగ్స్‌ కేసులో నోటీసులు వచ్చినట్లు కానీ, FIRలో తన పేరు ఉన్నట్లు కానీ నిరూపించాలని ఛాలెంజ్‌ చేశారు. 24 గంటల్లో ఆధారాలు తీసుకుని భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు రోహిత్‌రెడ్డి.

అయితే, రోహిత్ రెడ్డిపై ఎదురు దాడికి దిగారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. డ్రగ్స్‌ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న రోహిత్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేస్తానని అన్నారు. ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చి మోసం చేశారని ఆయన ఆరోపించారు. నిజంగా డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి సంబంధం లేదని, డ్రగ్స్ ఎప్పుడూ ముట్టలేదని ప్రమాణం చెయ్యాలని సవాల్ చేశారు రఘునందన్. అసలు దేవుడుపై నమ్మకం లేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఈ ప్రమాణాల సవాళ్లేంటని ప్రశ్నించారు.

నందు, సోమయాజులతో రోహిత్ రెడ్డికి ఎన్నేళ్ల నుంచి సంబంధాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు రఘునందన్. వాళ్లతో సంబంధాలున్నాయని, కేసీఆర్‌‌కు తెలుసా.. తెలీదా? అని ప్రశ్నించారు. ఎంఐఎం గుండాలని అడ్డం పెట్టుకొని సంపాదించిన ఆస్తుల సంగతేంటని ప్రశ్నించారు రఘునందన్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!