Funny Video: ఇదేంది భయ్యా మరీ ఇంత కామెడీని తట్టుకోగలమా? సోనూ సూద్, ఖాబీ లేమ్ కామెడీ నెక్ట్స్ లెవల్ అంతే..

సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ నటుడే కాకుండా.. విశాల హృదయుడు కూడా. ఆపద అన్న పదం వినిపిస్తే చాలు.. దేవుడిలా వెంటనే కరుణిస్తాడు. ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకుని ఆదుకుంటాడు.

Funny Video: ఇదేంది భయ్యా మరీ ఇంత కామెడీని తట్టుకోగలమా? సోనూ సూద్, ఖాబీ లేమ్ కామెడీ నెక్ట్స్ లెవల్ అంతే..
Sonu Sood And Khaby Lame
Follow us

|

Updated on: Dec 16, 2022 | 9:45 PM

సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విలక్షణ నటుడే కాకుండా.. విశాల హృదయుడు కూడా. ఆపద అన్న పదం వినిపిస్తే చాలు.. దేవుడిలా వెంటనే కరుణిస్తాడు. ఆపదలో ఉన్నవారిని అక్కున చేర్చుకుని ఆదుకుంటాడు. యావత్ భారతావనని కరోనా మహమ్మారి కుదిపేయగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి ఆపత్కాలంలో తానున్నాంటూ దేవుడిలా ముందుకొచ్చాడు సోనూ సూద్. ఎంతోమందికి సాయం చేశాడు. ఆకలితో అలమటించిన వారికి అన్నం పెట్టాడు.. అనారోగ్యంతో బాధపడున్న వారికి వైద్యం అందించాడు.. ఉద్యోగం లేదన్నా అంటే.. ఉపాధి కల్పించాడు.. ఇలా ఒకటా రెండా.. అడిగిన వారికి కాదనకుండా ఎన్నో సహాయ సహకారాలు అందించాడు సోనూ సోద్. అలా ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచాడు సోనూసూద్.

సోనూసూద్ సేవా కార్యక్రమాల్లో ఎంత యాక్టీవ్‌గా ఉంటాడో.. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ కాస్త యాక్టీవ్‌గానే ఉంటాడు. తాజాగా సోషల్ మీడియా ఫేమస్ స్టార్ ఖాబీ లేమ్‌ తో కలిసి సోనూ సూద్.. అద్భుతమైన కామెడీ చేశాడు. అది మామూలు కామెడీ కాదు గురూ. లాస్ట్ ట్విస్ట్‌కు సోనూ సూద్ ఫ్యూజులు ఔట్ అవ్వగా.. వీడియో చూసిన వారికి పొట్టచెక్కలవడం ఖాయం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ఈ వీడియోలో సోనూ సూద్, ఖాబీ లేమ్ ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు. ఇంతలో సోనూ భాయ్ ఓ మగ్‌లో జ్యూస్ తెచ్చి.. ఖాబీకి ఒక గ్లాస్‌ నిండా పోస్తాడు. అప్పటికే ఆ మగ్‌లో జ్యూస్ అయిపోతుంది. చివరన కొద్దిగా మాత్రమే ఉంటుంది. అయితే సోనూ సూద్ గ్లాస్‌ నిండా ఐస్ క్యూబ్‌లు ఉంటాయి. మిగిలిన ఆ కొద్ది జ్యూస్‌ను తన గ్లాస్‌లో పోసుకుంటాడు సోనూ. తన గ్లాస్‌లో స్ట్రా కూడా ఉంటుంది. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అవుతంది. ఖీబ్.. స్ట్రా తీసుకోవడానికి ట్రై చేస్తుంటే.. సోనూ మాత్రం జ్యూస్ ఇస్తాడేమో అనుకుని వద్దు వద్దు అంటూ మొహమాట పడుతుంటాడు. ఇంతలో ట్విస్ట్ ఇస్తూ ఖీబ్ తనకు అవసరమైన స్ట్రా ను తీసుకుంటాడు. దాంతో సోనూ షాక్ అవుతాడు. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

సోనూ సూద్ షేర్ చేసిన వీడియో..

View this post on Instagram

A post shared by Khaby Lame (@khaby00)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఓటీటీలోకి రాబోతున్న హారర్ మూవీ షైతాన్.. చూస్తే తడిసిపోవాల్సిందే
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
ఏపీలో పెన్షన్ల పంపిణీపై పరేషాన్.. ఇంటి నుంచి బ్యాంకుకు వయా..
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
మండే ఎండలకు బ్రేక్.. తెలంగాణకు వర్ష సూచన
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
పోటీకి సిద్ధమైంన జాన్వీ కపూర్‌.. దిశా పటాని..
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
శని వదలట్లేదుగా! టీ20 ప్రపంచకప్ అంపైర్ల లిస్టులో టీమిండియా విలన్
భూమి బరువు తగ్గుతుందా ?? అసలు భూమి బరువెంత ??
భూమి బరువు తగ్గుతుందా ?? అసలు భూమి బరువెంత ??