Banana: చలికాలంలో రాత్రిపూట అరటిపండు తినొచ్చా? తినకూడదా? దీనిని ఎవరు తినొద్దు?
చలికాలంలో అరటిపండును రాత్రిపూట తినాలా వద్దా అని చాలా మంది సందిగ్ధంలో ఉంటారు. ఎందుకంటే అరటిపండులో ఉష్ణోగ్రతను తగ్గించే లక్షణాలు ఉంటాయని అందరూ భావిస్తారు. అందుకే అరటి పండును చలికాలంలో..
చలికాలంలో అరటిపండును రాత్రిపూట తినాలా వద్దా అని చాలా మంది సందిగ్ధంలో ఉంటారు. ఎందుకంటే అరటిపండులో ఉష్ణోగ్రతను తగ్గించే లక్షణాలు ఉంటాయని అందరూ భావిస్తారు. అందుకే అరటి పండును చలికాలంలో తినేందుకు వెనుకాడుతారు. ఇక అరటిపండును మధ్యాహ్నం పూట మాత్రమే తినాలని చెబుతుంటారు. వాస్తవంగా చూసుకుంటే.. అరటి పండు ఆరోగ్యకరమైన పండు. ఇందులో కాల్షియం, ఐరన్ సహా అనేక పోషకాలు ఉన్నాయి. ఇన్ని పోషకాలు ఉన్న ఈ పండును నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అందరూ అనుమానిస్తున్నట్లు చలికాలంలో రాత్రిపూట అరటిపండు తినాలా? వద్దా? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
చలికాలంలో రాత్రిపూట అరటిపండు తినాలా వద్దా?
రాత్రిపూట అరటిపండు తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే మాత్రం తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది. నిద్రపోయే ముందు అరటిపండు తింటే శ్లేష్మం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతే కాదు, అరటిపండ్లు జీర్ణం కావడానికి కూడా సమయం పడుతుంది. ఇది మలబద్ధకం సమస్యను పెంచుతుంది. ఈ కారణంగా అరటిపండును రాత్రి సమయంలో కంటే.. పగటిపూట తినడమే ఉత్తమం.
చలికాలంలో పిల్లలకు అరటిపండ్లు తినిపించొచ్చా?
పిల్లలకు చలికాలంలో అరటిపండ్లను తినిపించొచ్చా? లేదా? అని తల్లిదండ్రుల నుంచి తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. అరటిపండులో దాదాపు 100 కేలరీల శక్తి ఉంటుంది. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. అందుకే ప్రతి సీజన్‌లో పిల్లలకు అరటిపండ్లు తినిపించాలని అంటారు. అయితే, ఎండాకాలమైనా? చలికాలమైనా? పిల్లలకు కఫం ఉంటే మాత్రం రాత్రిపూట అరటిపండును తినిపించకూడదు.
వీరు అరటిపండు తినకూడదు..
దంతాలకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు అరటి పళ్ళు తినకూడదు. ఇది కాకుండా, మైగ్రేన్‌తో బాధపడుతున్న రోగులు కూడా అరటిపండును తినొద్దు. అంతే కాకుండా షుగర్ వ్యాధి ఉన్నవారు అరటిపండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..